ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి
ABN , Publish Date - Mar 25 , 2025 | 01:18 AM
నిరుద్యోగ యువతకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పరిశ్రమల జిల్లా అధికారి ప్రసాద్ పేర్కొన్నారు.

ముమ్మిడివరం, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువతకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పరిశ్రమల జిల్లా అధికారి ప్రసాద్ పేర్కొన్నారు. ముమ్మిడివరం అంబేడ్కర్ కమ్యూనిటీ భవనంలో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నిరుద్యోగ యువత ప్రభుత్వ పథకాలు వినియోగించుకుని బ్యాంకు నుంచి రుణాలు పొంది సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలు, బ్యాంకు నుంచి రుణాలు ఎలా రుణాలు పొందాలనే విషయాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జిల్లా అధికారిణి మాధురి, కోఆర్డినేటర్ వెంకట్, ఎంఎస్‌ఎఫ్‌ఈ ఫ్యాకల్టీ గణేష్, పీపుల్ సర్వీస్ ఆర్గనైజేషన్ కె.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.