బలభద్రపురంలో కేన్సర్‌పై ఆందోళన వద్దు
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:25 AM
బలభద్రపు రం గ్రామంలో రెండు రోజుల పాటు ఇంటింటా సర్వే పూర్తి చేసి..38 మంది కేన్సర్ అనుమానిత లక్షణాలున్నట్టు గుర్తించామని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు

ముగిసిన సర్వే
అనపర్తి,మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : బలభద్రపు రం గ్రామంలో రెండు రోజుల పాటు ఇంటింటా సర్వే పూర్తి చేసి..38 మంది కేన్సర్ అనుమానిత లక్షణాలున్నట్టు గుర్తించామని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు.గ్రామంలో వైద్య శిబిరాలను సోమవారం మరోసారి సందర్శించి మాట్లాడారు. 17 మంది వైద్యాధికారులు 98 మంది వైద్య సిబ్బందితో 31 బృందాలు గ్రామంలో రెండు రోజులు జల్లెడ పట్టి 38 మందికి క్యాన్సర్ అనుమానిత లక్షణా లున్నట్టు గుర్తించారన్నారు.స్వతంత్ర హాస్పిటల్, జీఎస్‌ఎల్ ఆసుపత్రులకు చెందిన కేన్సర్ స్ర్కీనింగ్ వాహనాన్ని గ్రామానికి తీసుకువచ్చి సోమవారం మధ్యాహ్నం వరకు పది మందికి స్ర్కీనింగ్ టెస్టులు నిర్వహించగా ఒక్కరికీ వ్యాధి నిర్ధారణ కాలేదన్నారు. గతంలో గ్రామంలో నిర్వహించిన ఇంటింటా సర్వేలో 32 మందికి కేన్సర్ నిర్ధారణ అయినట్టు గుర్తించామని వీరిలో 15 మందికి చికిత్స పూర్తి కాగా మరో 17 మంది చికిత్స పొందుతున్నారన్నారు. వచ్చే మూడు రో జులు గ్రామంలో స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామని అనంతరం వచ్చే కేసులను ఆసుపత్రులకు తరలించి పరీక్షలు చేస్తామన్నారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సూచనల మేరకు గ్రామంలోని ప్రతి ఒక్కరికీ రక్త పరీక్షలు చేయిస్తామన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందన్నా రు.బలభద్రపురంలో క్యాన్సర్ మహమ్మారిని అరికట్టేందుకు మూల కారణాలను అన్వే షించాలని అపుడే సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.కార్యక్రమంలో డీఎంహెచ్‌వో వెంకటేశ్వరరావు,ఎన్టీఆర్ ఆరోగ్యసేవ కోఆర్డినేటర్ ప్రియాంక, డాక్టర్ రాజీవ్, ప్రొఫెసర్ ఎస్.ప్రశాంత్, డాక్టర్ సుజాత, శ్యామల, ఒమీబాబా కేన్సర్ ఇన్సిస్టిట్యూట్ వైద్యులు డోలా రోసా తదితరులు పాల్గొన్నారు.