పొగాకు రైతుల సమస్యలు పరిష్కరిస్తా
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:23 AM
ఈ ఏడాది పొగాకు ధరలు ఆశా జనకంగా ఉంటాయని పొగాకుబోర్డు ఎగ్జిక్యూ టివ్ డైరెక్టర్ బీ.విశ్వశ్రీ ఆశాభావం వ్యక్తం చేశారు.

దేవరపల్లి/గోపాలపురం, మార్చి 24 (ఆం ధ్రజ్యోతి) : ఈ ఏడాది పొగాకు ధరలు ఆశా జనకంగా ఉంటాయని పొగాకుబోర్డు ఎగ్జిక్యూ టివ్ డైరెక్టర్ బీ.విశ్వశ్రీ ఆశాభావం వ్యక్తం చేశారు. దేవరపల్లి,గోపాలపురం పొగాకు వేలం కేంద్రాలను సోమవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. రైతులు నాణ్యమైన పొగాకును ఉత్పత్తి చేసి తగిన గిట్టుబాటు ధర సాధిం చుకోవాలన్నారు.ఇతర దేశాల్లో ఏర్పడిన కొరత కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో మన పొగాకుకు మంచి డిమాండ్ ఉందన్నారు. నాణ్యమైన పొగాకుకు అత్యధిక ధర లభిస్తుం దన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.తొలిరోజు సోమవారం పొగాకు బోర్డుకు చెరుకుమిల్లి, కాటవరం గ్రామాల నుంచి 27 బేళ్లు వేలానికి పెట్టారు. ఎన్‌ఎల్‌ఎస్ పొగాకుకు కిలో రూ.290 ధర పలికింది. ఎన్‌బీ ఎస్ పొగాకు కిలో రూ.280 ధర పలికింది. పొగాకురైతులు కరుటూరి శ్రీనివాస్, కాట్రు వీరవెంకట సత్య నారాయణ,పరిమి శ్రీరామ కృష్ణ మాట్లాడుతూ ఈ ఏడాది ప్రారంభంలో రూ.290లు ధర ఇచ్చారని రైతులకు గిట్టు బా టు కాదన్నారు. మహిళా రైతు కరుటూరి ఉషారాణి మాట్లాడుతూ గతేడాది ప్రారంభం లో కేజీ రూ.240..చివరిలో కేజీ రూ. 420 ధర పలికిందని...అలా కాకుండా ప్రారం భం నుం చి చివరి దశ వరకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలని కోరారు.అనంతరం ఈడీని మహిళా రైతులు సత్కరించారు. కార్యక్రమంలో పొగాకు బోర్డు ఆర్‌ఎం జీఎల్‌కే.ప్రసాద్, ఏఎస్ హేమ స్మిత, వేలం నిర్వహణాధికారి శ్యామ్ రైతు లు సుంకవల్లి శ్రీనివాసరావు, బిక్కిన నాగ రాజు, నరహరశెట్టి రాజేంద్రబాబు, యా గంటి సాయిబాబు, రైతు సంఘం అధ్యక్షుడు ఇల్లూరి రాంబాబు, మాజీ రైతు సంఘం అధ్యక్షుడు మధుమోహన్, పరిమి జగదీష్ పాల్గొన్నారు.