Share News

పీజీఆర్‌ఎస్‌కు 193 అర్జీలు

ABN , Publish Date - Apr 08 , 2025 | 12:26 AM

రీ ఓపెన్‌ అయిన అర్జీల విషయంలో మరింత జవాబుదారీతనం కలిగి ఉండాలని జేసీ ఎస్‌.చిన్నరాముడు ఆదేశించారు.

పీజీఆర్‌ఎస్‌కు 193 అర్జీలు
బాధితుల సమస్యలు వింటున్న ఎస్పీ నరసింహ కిశోర్‌

రాజమహేంద్రవరం రూరల్‌, ఏప్రిల్‌ 7 (ఆం ధ్రజ్యోతి): రీ ఓపెన్‌ అయిన అర్జీల విషయంలో మరింత జవాబుదారీతనం కలిగి ఉండాలని జేసీ ఎస్‌.చిన్నరాముడు ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి మా ట్లాడారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.జిల్లాలో 964 అర్జీలు రీ ఓపెన్‌ కాగా ఇంకా 69 పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపారు. రీ ఓపెన చేసిన ప్రతి అర్జీదారుడిని వ్యక్తిగతంగా కలిసి పరిష్కారం వివరాలు తెలియచేయాలన్నారు. అనంతరం 199 అర్జీలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.కార్యక్రమంలో డీఆర్‌వో టి.సీతారామమూర్తి,స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎంఆర్‌ ఆర్‌.ప్రేమ్‌కుమార్‌,డీఎల్‌డీవోలు పి.వీణాదేవి, ఏ.స్లీవారెడ్డి, డీపీవో శాంతమణి పాల్గొన్నారు.

ఎస్పీ గ్రీవెన్స్‌కి 46 ఫిర్యాదులు

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పబ్లిక్‌ గ్రీవెన్స్‌ నిర్వహించారు. ఎస్పీ నరసింహ కిశోర్‌ స్వయంగా ఫిర్యాదుదారులతో మాట్లాడి పలు సమస్యలపై వెంటనే ఫోన్‌ ద్వారా ఆయా పోలీస్‌ స్టేషన్ల బాధ్యులకు సూచనలు చేశారు. చట్ట పరిధిలో త్వరితగతిన పరిష్కారం చూపా లని ఆదేశించారు. ఫిర్యాదుదారుల నుంచి 46 అర్జీలను స్వీకరించారు.ఈ కార్యక్రమంలో అడిష నల్‌ ఎస్పీలు ఎన్‌బీఎం.మురళీకృష్ణ, ఏవీ సుబ్బ రాజు,ఎస్‌బీ డీఎస్పీ బి.రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2025 | 12:26 AM