షెడ్యూల్డ్ కులాల ఆర్థిక బలోపేతానికి చర్యలు
ABN , Publish Date - Mar 21 , 2025 | 12:54 AM
షెడ్యూల్డ్ కులాల ఆర్థిక పురోభివృద్ధికి కేంద్ర ప్రభు త్వం అమలు చేస్తున్న ఆర్థిక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కలవచర్ల కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) హెడ్ వీఎస్‌జీఆర్ నాయు డు పేర్కొన్నారు. మండలంలో కల వచర్లలోని కేవీకేలో షెడ్యూల్డ్ కు లాల ఉప ప్రణాళిక-రైతులు, రైతు మహిళలకు గురువారం క్షేత్ర ప్రద ర్శన నిర్వహించారు.

కేవీకే హెడ్ వీఎస్‌జీఆర్ నాయుడు
రాజానగరం, మార్చి 20(ఆంధ్రజ్యోతి): షెడ్యూల్డ్ కులాల ఆర్థిక పురోభివృద్ధికి కేంద్ర ప్రభు త్వం అమలు చేస్తున్న ఆర్థిక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కలవచర్ల కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) హెడ్ వీఎస్‌జీఆర్ నాయు డు పేర్కొన్నారు. మండలంలో కల వచర్లలోని కేవీకేలో షెడ్యూల్డ్ కు లాల ఉప ప్రణాళిక-రైతులు, రైతు మహిళలకు గురువారం క్షేత్ర ప్రద ర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షెడ్యూల్డ్ కు లాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్రం షెడ్యూల్డ్ కు లాల ఉప ప్రణాళికను అమలు చేస్తోందని, దీని లో భాగంగా అందించే పరికరాలను రైతులు, సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పశుసంవర్ధక అధికారి బి.నాగేశ్వరరెడ్డి, నికోబారి, శ్రీనిధి, ఆసిల్ కోళ్ల జాతులను, బ్లాక్ బెంగాల్ పొట్టి మేకల జాతిని ప్రదర్శనగా చేపట్టి, వాటిని తక్కువ ఖర్చుతో పెంచే పద్ధతులను వివరిం చగా, సస్యరక్షణ అధికారి రఘునందన్ వంగ, అరటి రకాలను ప్రదర్శించారు. అలాగే గృహ విజ్ఞానాధికారి సంజయ్ హెగ్డే పచ్చి, పండు పనసకాయలతో చేయగలిగే విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి ప్రదర్శించారు. కార్యక్రమంలో కేవీకే అధికారులు విజయ్‌వర్ధన్, రత్నాజీ, గొల్లప్రోలు, కోరుకొండ, రాజానగరం మండలాలకు చెందిన 50 మంది రైతులు, రైతు మహిళలు పాల్గొన్నారు.