సుజలమేనా!
ABN , Publish Date - Mar 22 , 2025 | 01:10 AM
మినరల్ వాటరే.. తాగండి పరవాలేదు.. ఇదీ ప్రస్తుతం ఎక్కడికి వెళ్లినా గ్లాసుతో నీళ్లిచ్చి ముందుగా చెప్పే మాట.. చాలామంది దృష్టిలో బయట నుంచి కొని టిన్నులతో తెచ్చుకుంది మినరల్ వాటర్ కింద లెక్క.. ఆ నీరు ఎంత వరకూ సురక్షితమంటే కాస్త ఆలోచించాల్సిందే మరి..

మినరల్ పేరిట మోసం
ప్యాకెట్లు.. బాటిళ్లతో సరఫరా
పుట్టగొడుగుల్లా ప్లాంట్‌లు
ఉమ్మడి జిల్లాలో 3 వేలు పైనే
కనీస నిబంధనలూ కరువే
ఐఎస్‌ఐ ప్రమాణాలు గాలికి
జనం ఆరోగ్యంతో జలగాటం
కన్నెత్తి చూడని అధికారులు
మామూళ్ల మత్తు
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
మినరల్ వాటరే.. తాగండి పరవాలేదు.. ఇదీ ప్రస్తుతం ఎక్కడికి వెళ్లినా గ్లాసుతో నీళ్లిచ్చి ముందుగా చెప్పే మాట.. చాలామంది దృష్టిలో బయట నుంచి కొని టిన్నులతో తెచ్చుకుంది మినరల్ వాటర్ కింద లెక్క.. ఆ నీరు ఎంత వరకూ సురక్షితమంటే కాస్త ఆలోచించాల్సిందే మరి.. ప్లాంట్ నీళ్లు తెచ్చుకున్నంత మాత్రాన సురక్షితం కాదు సుమా..! ఏదో మినరల్ వాటర్ తాగుతున్నామని పైకి చెప్పుకోవడం తప్ప.. బోరు వాటర్ కంటే అధ్వానమే మరి.. ఒకసారి మీరు మంచినీళ్లు తెచ్చుకునే ప్లాంట్‌కు అని అనుమతులు ఉన్నాయో లేదో చూస్కోండి.. లేదంటే మీ ఆరోగ్యం గోవిందా!?మినరల్ వాటర్ అనుకుంటూ లీటరు రూ.20 పెట్టికొంటున్నాం. మినరల్స్ మాట దేవుడెరుగు.. అసలు అవి సురక్షిత తాగునీరేనా? అంటే ఆలో చించాల్సిందే. కలుషిత నీటి వల్ల వివిధ రోగాల బారిన పడే ప్రమాదం ఉన్నా యంత్రాంగం ఉదాశీనంగా వ్యవహరిస్తోంది. దీంతో వాటర్ ప్లాంట్లు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. సరైన పర్యవేక్షణ.. నియంత్రణ లేక మామూలు నీటిని నింపేసి నీళ్లలా డబ్బును దోచేస్తున్నారు. ప్యాకెజ్డ్, ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ రంగం వేల కోట్ల రూపాయల వ్యాపారమైపోయింది. నేడు ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా వాటర్ ప్లాంట్లపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
పుట్టగొడుగుల్లా..
తాగునీరు ఇండియన్ స్టాండర్డ్స్ (ఐఎస్) ప్రమాణాల ప్రకారం ఉండాల్సిందే. కానీ వాటర్ ప్లాంట్ల విషయంలో అది అమలుకావడం లేదు. వాటర్ ప్లాంటు పెట్టాలంటే బోరుకు వాల్టా చట్ట ప్రకారం స్థానిక సంస్థలు తదితర అనుమతు లు ఉండాలి. నీరు శుద్ధి చేసిన తర్వాత ప్యాకె ట్లు, బాటిళ్లలో ప్యాక్ చేసి విక్రయించాలంటే కచ్చితంగా ఐఎస్‌ఐ ఉండాలి. ప్రభుత్వ అధికా రులు వచ్చి ల్యాబ్‌తో సహా ఉన్నాయా లేదా అనే ది పూర్తిగా తనిఖీలు చేస్తారు. నమూనాలను మైక్రో బయాలజీ ల్యాబ్‌లకు పంపించి పరిశీలి స్తారు. ఇది తీసుకున్న తర్వాత ఫుడ్ సేఫ్టీ అధి కారులు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) సర్టిఫికెట్ ఇస్తారు. ఇవి ఉంటేగానీ ప్యాక్ చేసి అమ్మడానికి వీల్లేదు. ఐఎస్‌ఐ లైసెన్స్‌కి ఏడాదికి రూ.1.25 లక్ష లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది వాటర్ ప్లాంట్ల యజమానులు నిబంధన లకు నీళ్లొదిలేశారు. లూజ్ వాటర్ పేరుతో ప్లా స్టిక్ వాటర్ బాటిళ్లు, నాసిరకం వాటర్ ప్యా కెట్లలో నీటిని నింపి విక్రయిస్తున్నారు. నిబంధ నల ప్రకారం లూజ్ వాటర్‌కి ఐఎస్‌ఐ10500 ప్రకారం నాణ్యతా ప్రమాణాలు ఉండాలి. వాటర్ ప్యాకెట్లు, బాటిళ్లప్లాస్టిక్‌లో నాణ్యతా ప్రమాణా లూ పాటించడం లేదు. చాలా ప్యాకెట్లలో నీరు ప్లాస్టిక్ వాసన వస్తుంటుంది. ఐఎస్‌ఐ కలిగిన బ్రాండెడ్ కంపెనీల లీటరు వాటరు బాటిల్ రూ.12-14 ఉంటే, నాసిరకం రూ.7-8కే దొరుకు తుంది. లాభం ఎక్కువగా వస్తుందనే కక్కుర్తితో నాసిరకం నీటినే అధికశాతం అమ్మకాలు సా గిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఐఎస్ సర్టిఫికెట్ కలిగినవి కేవలం 10 వరకూ ఉంటే, లేనివి 3 వేల పైమాటే. అసలు ఎన్ని వాటర్ ప్లాంట్లు ఎక్కడెక్కడ ఉన్నాయనే లెక్క యంత్రాంగం వద్ద లేకపోవడం గమనార్హం.
మనమే పరీక్షించుకోవచ్చు..?
మనం తాగేనీటిలో మెగ్నీషియం, కాల్షియం, సోడియం, పొటాషియం, ఇనుము, రాగి, జింక్ వంటివి కలిసిపోయి ఉంటాయి. వీటన్నింటినీ కలిపి మొత్తం కలిగి ఉన్న లవణాలు లేదా టోటల్ డిసాల్వుడు సాలిడ్స్ (టీడీఎస్) అంటా రు. టీడీఎస్‌తోపాటు పీహెచ్ స్థాయిలను బట్టి ఆ నీళ్లు మనం తాగొచ్చా లేదా అనేది నిర్ధారి స్తారు. టీడీఎస్ ఎక్కువగా ఉన్నా, పీహెచ్ స్థాయి 6 కంటే తక్కువగా 8.5 కంటే ఎక్కువగా ఉంటే రోగాల బారిన పడడం ఖాయం. టీడీఎస్, పీహెచ్ మీటర్లు బయట మార్కెట్లో దొరుకుతా యి. వాటితో మనం తాగేనీరు పరీక్షించవచ్చు.
తాగునీటి ప్రమాణాలివే..
తాగునీరు కచ్చితంగా ఐఎస్‌ఐ ప్రమాణాలకు లోబడి ఉండాల్సిందే.ప్యాకెజ్డ్ తాగునీరు ఐఎస్‌ఐ 14543 ప్రమాణాలు పాటించాలి. టీడీఎస్ సున్నా నుంచి 500 వరకూ ఉండాలి. మినరల్ వాటర్ ఐఎస్‌ఐ 13428 ప్రమాణాలతో టీడీఎస్ 150- 500 ఉండాలి. నాచురల్ డ్రింకింగ్ వాటర్ ఐఎస్‌ఐ10500 ప్రమాణాలు కలిగి టీడీఎస్ 0-2 వేలు వరకూ ఉండొచ్చు. ఏదైనా పీహెచ్ మా త్రం 6 కంటే తక్కువ 8.5 కంటే ఎక్కువ ఉండ రాదు. టీడీఎస్ అనేది ప్రాంతాలను బట్టి మా రుతుంటుంది. గోదావరి నీటిలో 150 ఉంటే, కృష్ణా నీటిలో 350 వరకూ ఉంటుంది. వర్షం నీటిలో అసలు టీడీఎస్ ఉండదు. ఆమ్ల గుణం ఉంటుంది. బోరు నీటిలో టీడీఎస్ 10 నుంచి 15 వేల వరకూ ఉంటుంది. రివర్స్ ఓస్మాసిస్ ప్రక్రి య అనేది టీడీఎస్ తగ్గించడానికి చేస్తారు. దీని వల్ల 50ు నీరు వృథా కావడంతోపాటు అవ సరమైన లవణాలు పోతాయి. దాంతో లవ ణాలు కలిపి మినరల్ వాటర్‌గా అమ్ముతారు. అలా్ట్ర వయోలెట్, అలా్ట్ర ఫిల్టరేషన్ ప్రక్రియ ద్వారా బ్యాక్టీరియా మాత్రమే నశిస్తుంది.
నీళ్లు తాగితే.. రోగాలే?
నిర్ధారిత ప్రమాణాల ప్రకారం లేని నీటిని తాగితే రోగాల బారిన పడక తప్పదు. తాగు నీటిలో బ్యాక్టీరియా, వైరస్‌లు ఉండకూడదు. పీహెచ్ 6 కంటే తక్కువ 8.5 కంటే ఎక్కువ ఉండొద్దు. టీడీఎస్ కూడా అత్యధికంగా 2 వేలకు మించరాదు. అలా లేకపోతే అల్సర్లు, ఎసిడిటీ, అజీర్తి, ఉదర సంబంధిత వ్యాధులు, గ్యాస్ట్రిక్, మోకాళ్ల నొప్పులు వంటివి వస్తాయి.
కేసులు.. జరిమానాలు
మిస్ బ్రాండింగ్ అంటే లేబుల్‌పై ప్రచురించిన ప్రకారం ఉండకపోతే రూ.3 లక్షల వరకూ జరిమానా విధిస్తారు. పీహెచ్ విలువ నిర్ధారించిన దానికంటే తక్కువగా ఉంటే రూ. 5 లక్షల వరకూ జరిమానా వేస్తారు. అన్‌సేఫ్.. అంటే ప్రజల ఆరోగ్యానికి హానికరం అని తేలితే కోర్టులో కేసు వేస్తారు. విచారణలో నేరం రుజువైతే రూ.5 లక్షల వరకూ జరిమానా లేదా 6 నెలల జైలు లేదా రెండూ విధించే అవకాశం ఉంది.
నేడు జల దినోత్సవం
తాగునీటి ప్రాముఖ్యత, వినియోగమే ఉద్దేశం గా 1993 నుంచీ మార్చి 22న అంతర్జాతీయ జల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 2030 నాటికి సురక్షిత తాగునీరు, పారిశుధ్య రంగాల్లో సుస్థిర అభివృద్ధికి మద్దతు ఇవ్వడమే దీని లక్ష్యంగా అమలు చేస్తున్నారు. ‘హిమానీ నదం సంరక్షణ’ థీమ్‌తో ఈ ఏడాది అంతర్జాతీయ జల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.