Share News

మద్యం కుంభకోణంలో జగన్‌ను అరెస్టు చేయాలి: మాజీ మంత్రి డొక్కా

ABN , Publish Date - Jan 01 , 2025 | 05:26 AM

‘గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం, మైనింగ్‌ దోపిడీ కేసులను సీబీఐకి అప్పగించాలి.

మద్యం కుంభకోణంలో జగన్‌ను అరెస్టు చేయాలి: మాజీ మంత్రి డొక్కా

అమరావతి, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): ‘గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం, మైనింగ్‌ దోపిడీ కేసులను సీబీఐకి అప్పగించాలి. రూ.లక్ష కోట్ల మద్యం కుంభకోణానికి పాల్పడిన జగన్‌రెడ్డిని అరెస్ట్‌ చేయాలి’ అని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘గత ప్రభుత్వం చేసిన అనేక నిర్వాకాలను ప్రజల ముందు తెచ్చి, వారి మన్ననలు పొంది, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. గత ఐదేళ్లు దోచుకున్న జగన్‌, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలి. జెత్వానీ కేసులో నిందితులైన ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను సస్పెండ్‌ చేస్తే చాలదు. వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలి’ అన్నారు. ఎస్సీ వర్గీకరణలో జాబితాల రూపకల్పన ప్రక్రియను మరో వారం పొడిగించాలని డొక్కా ప్రభుత్వాన్ని కోరారు.

Updated Date - Jan 01 , 2025 | 05:26 AM