Share News

బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి

ABN , Publish Date - Mar 23 , 2025 | 11:52 PM

ఆర్డీఎస్‌ కుడికాలువ నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఆర్డీఎస్‌ కుడికాలువ సాధన సమితి నాయకుడు కేఆర్‌ రాఘవరెడ్డి, ఉపాధ్యక్షులు సత్యనారాయణరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి
ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్‌లో దీక్షల్లో పాల్గొన్న ఆర్డీఎస్‌ కుడికాలువ సాధన సమితి నాయకులు

- ఆర్డీఎస్‌ కుడికాలువ సాధన సమితి ఆధ్వర్యంలో దీక్షలు

ఎమ్మిగనూరు, మార్చి23 (ఆంధ్రజ్యోతి): ఆర్డీఎస్‌ కుడికాలువ నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఆర్డీఎస్‌ కుడికాలువ సాధన సమితి నాయకుడు కేఆర్‌ రాఘవరెడ్డి, ఉపాధ్యక్షులు సత్యనారాయణరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం పట్టణంలోని సోమప్ప సర్కిల్‌లో సాధన కమిటీ టీచర్‌ నాగన్న ఆధ్వర్యంలో కమిటీ నాయకులు, ప్రజాసంఘాల నాయకులు ఒక రోజు నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుంగభద్ర నదిపై ఆర్డీఎస్‌ కుడికాలువ నిర్మించుకోవటానికి బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ హక్కులు ఇచ్చిందన్నారు. అయితే పాలక ప్రభుత్వాలు నిధులు కేటాయించకుండా కర్నూలు జిల్లా పశ్చిమప్రాంతాన్ని శాశ్వతకరువు ప్రాంతంగా మార్చాయన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రతి ఏడాది తుంగభద్రనదిలో 150టీఎంసీల జలాలు శ్రీశైలం జలాశయంలో కలుస్తున్నాయన్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాంతంలో రిజర్వాయర్లు నిర్మాణాలకు నిధులు కేటాయించకుండా మోసపూరిత వాగ్దానాలతో అభివృద్ధి చేయడం లేదని విమర్శించారు. ఆర్డీఎస్‌ కుడికాలువ నిర్మాణానికి నిధులు తీసుకోచ్చేందుకు ఎమ్మిగనూరు, మంత్రాలయం ఎమ్మెల్యేలు పోరాటం చేయాలని లేని పక్షంలో వారి ఇళ్లను ముట్టడిస్తామన్నారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆర్డీఎస్‌ కుడికాలువ నిర్మాణానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కన్వీనర్‌ పంపన్న గౌడ్‌, నాయకులు బతకన్న, గణేష్‌, నీలకంఠ, ఎస్‌ సాంసోన, స్వామిదాసు, వీరప్రతాఫ్‌, ఉరుకుందు, నాగేష్‌, నరసన్న, లక్ష్మన్న, గడ్డం ఉసేని, ఎల్లప్ప పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 11:52 PM