Share News

Anganwadi recruitment: నేడే అంగన్వాడీ నోటిఫికేషన్‌

ABN , Publish Date - Mar 22 , 2025 | 04:30 AM

వీటిలో 160 అంగన్వాడీ కార్యకర్తలు, 60 మినీ అంగన్వాడీ కార్యకర్తలు, 728 ఆయాలు.. వెరసి 948 పోస్టులు భర్తీ చేయనున్నట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఈమేరకు శనివారం జిల్లాల్లో పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను కలెక్టర్లు విడుదల చేయనున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Anganwadi recruitment: నేడే అంగన్వాడీ నోటిఫికేషన్‌

948 కార్యకర్తలు, హెల్పర్‌ పోస్టుల భర్తీ: మంత్రి సంధ్యారాణి

అమరావతి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల పోస్టుల భర్తీకి కూటమి సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వీటిలో 160 అంగన్వాడీ కార్యకర్తలు, 60 మినీ అంగన్వాడీ కార్యకర్తలు, 728 ఆయాలు.. వెరసి 948 పోస్టులు భర్తీ చేయనున్నట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఈమేరకు శనివారం జిల్లాల్లో పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను కలెక్టర్లు విడుదల చేయనున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పోస్టుల భర్తీ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ పోస్టుల ఎంపికకు రాతపరీక్ష ఉంటుందని, అర్హత ఉన్నవాళ్లను మాత్రమే ఎంపిక చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అలాగే, రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలో 139 కొత్త అంగన్వాడీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సంధ్యారాణి తెలిపారు. పీఎంజన్‌మన్‌ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో 139 కొత్త అంగన్వాడీ సెంటర్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రూ.20.80 కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. అంగన్వాడీల సేవలను మరింత బలోపేతం చేయడంతోపాటు, మహిళలకు ఉపాధి అవకాశాలను పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. పిల్లల పోషణ, ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు. పిల్లలు, మహిళల అభివృద్ధి కార్యక్రమాల కోసం 2025-26 బడ్జెట్‌పై కూడా అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు మంత్రి తెలిపారు.


ఇవి కూడా చదవండి:

Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు

Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా

MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే

Updated Date - Mar 22 , 2025 | 04:30 AM