Share News

Job Preparation: జాబ్ కొట్టాలనుకుంటున్నారా.. ఈ ఆహారానికి దూరంగా ఉండండి

ABN , Publish Date - Mar 24 , 2025 | 07:59 AM

మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారా.. అయితే ఏకాగ్రతగా చదవడం ఎంత ముఖ్యమో.. మంచి ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎలాంటి ఆహారానికి దూరంగా ఉండాలంటే

Job Preparation: జాబ్ కొట్టాలనుకుంటున్నారా.. ఈ ఆహారానికి దూరంగా ఉండండి
Job

పోటీ పరీక్షలకు చదువుతున్నారా.. గవర్నమెంట్ జాబ్ మీ లక్ష్యమా.. అయితే అందుకు పట్టుదలగా చదవడం ఎంత ముఖ్యమో.. మీరు తీసుకునే ఆహారం కూడా అంతే ముఖ్యం అంటున్నారు నిపుణులు. కొన్ని రకాల ఆహార పదార్థాలు ఏకాగ్రత, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని.. అందుకే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు అలాంటి ఆహారానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఆ వివరాలు..


స్వీట్స్, కూల్‌డ్రింక్స్‌కు నో

పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు స్వీట్లు, కూల్ డ్రింక్స్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇవి త్వరగా శక్తినిచ్చినా, రక్తంలో చక్కెర స్థాయి హఠాత్తుగా పడిపోయేందుకు కారణం అవుతాయి. ఫలితంగా అలసిపోవడం, ఏకాగ్రత లోపించడం జరుగుతుంది. హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రకారం స్వీట్లు, కూల్‌డ్రింక్స్ మెదడు పనితీరును తగ్గిస్తాయంటున్నారు.


జంక్ ఫుడ్..

పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు జంక్ ఫుడ్ అయిన పిజ్జా, బర్గర్ వంటి వాటిని పూర్తిగా మానుకోవాలి అంటున్నారు నిపుణులు. వీటిల్లో కొవ్వు, ఉప్పు ఎక్కువగా ఉంటాయని.. ఇవి జీర్ణం కావడానికి అధిక సమయం పడుతుందని అంటున్నారు. అలానే ఇవి నీరసం కలిగిస్తాయని చెబుతున్నారు. జర్నల్ ఆఫ్ న్యూట్రిషనల్ సైన్స్ (2020) ప్రకారం, జంక్ ఫుడ్ జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తుంది.


అతిగా కెఫీన్

కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ తక్కువ మోతాదులో తీసుకుంటే మేలు చేస్తాయి. అదే వాటి డోస్ ఎక్కువైతే ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. రోజుకు 400 మి.గ్రా. కంటే ఎక్కువ కెఫీన్ హానికరం అని చెబుతోంది.


నూనె ఆహారాలు..

నూనె ఆహారాలు అనగా సమోసా, పూరీ వంటివి జీర్ణం కావడానికి అధిక శక్తిని ఖర్చు చేస్తాయి. ఫలితంగా శరీరం నీరసపడుతుంది. ఇండియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ (2021) ప్రకారం, ఇవి మెదడుకు ఆక్సిజన్ సరఫరాను తగ్గిస్తాయి అని తెలిసింది.


ప్రాసెస్డ్ ఫుడ్, ఆల్కహాల్

సాసేజ్‌లు, మద్యం వంటి పదార్థాలు రసాయనాలతో నిండి ఉంటాయి. ఇవి మానసిక స్పష్టతను దెబ్బతీస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం సాసేజ్‌లు ఆరోగ్యానికి హానికరం.

నిపుణుల సలహా

పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు తాజా పండ్లు, కూరగాయలు, గింజలు, నీరు ఎక్కువగా తీసుకోవాలి. డీహైడ్రేషన్ ఏకాగ్రతను తగ్గిస్తుంది కాబట్టి జాగ్రత్త వహించాలి.. తగినంత నీరు తాగాలి అని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆనందం.. తెలుగు రాష్ట్రాల్లో కిక్కిచ్చే పర్యాటక ప్రాంతాలు ఇవే

మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 24 , 2025 | 08:09 AM