Share News

Alapati Rajendra Prasad: జగన్ విధానాలతో ఏపీకి తీరని నష్టం

ABN , Publish Date - Feb 06 , 2025 | 03:11 PM

Alapati Rajendra Prasad: జగన్ విధానాలతో ఏపీకి తీరని నష్టం కలిగిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శించారు. జగన్ వ్యవస్థలను అన్నిటిని నిర్వీర్యం చేసి విధ్వంసక పాలన సాగించారని మండిపడ్డారు. జగన్ రెడ్డి తన స్థితి ఏంటో తెలుసుకుని మాట్లాడాలని ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు.

 Alapati Rajendra Prasad: జగన్ విధానాలతో ఏపీకి తీరని నష్టం

అమరావతి: ఓడిపోయాక కూడా వైసీపీ అధినేత జగన్ రెడ్డి ఆలోచన తీరులో ఏమాత్రం మార్పు రాలేదని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శించారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు. శుక్రవారం తాను నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో కూటమి నాయకత్వం, కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని అన్నారు. ఇప్పటికే 3,46,000 పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారని ఆలపాటి రాజేంద్రప్రసాద్ చెప్పారు.


రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేయాలంటే కూటమికి మద్దతు తెలియజేయాలని అన్నారు. గత పాలనలో ఎంత నష్టం, కష్టం జరిగిందో అందరికీ తెలుసు.. ప్రజలు సైతం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. రాజకీయాల్లో ఎలాంటి విలువలు లేని ఏకైక వ్యక్తి జగన్ రెడ్డి మాత్రమేనని విమర్శించారు.. దాదాపు 16 నెలలు జైల్లో ఉండి బెయిల్‌పై బయట తిరుగుతున్నా ముద్దాయి జగన్ రెడ్డి మాత్రమేనని ఆలపాటి రాజేంద్రప్రసాద్ చెప్పారు.


జగన్ వ్యవస్థలను అన్నిటిని నిర్వీర్యం చేసి విధ్వంసక పాలన సాగించారని మండిపడ్డారు. జగన్ రెడ్డి తన స్థితి ఏంటో తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద ఉంచిన ఘనత నీదే కాదా జగన్ రెడ్డి అని నిలదీశారు. జగన్ విధానాల వల్ల రాష్ట్రం 25 ఏళ్ల వెనక్కి వెళ్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. విభజన తర్వాత నష్టపోయిన రాష్ట్రానికి గత చంద్రబాబు ప్రభుత్వం రాజధానిగా అమరావతిని చేసి, పోలవరం నిర్మాణానికి నిరంతరం కృషి చేసి.. పెట్టుబడులు తీసుకువచ్చారని గుర్తుచేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి దిగిపోయే నాటికి ఏ ఒక్కటైనా అభివృద్ధి పని జరిగిందా అని ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి

YSRCP: వైసీపీ నేత అరాచకం.. ఏకంగా కిడ్నాప్ చేసి.. ఏం చేశారంటే..

MP Magunta Srinivasulu Reddy: ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి అస్వస్థత

ABN ఎఫెక్ట్ : ‘అక్షరమే ఆయుధంగా - పరిష్కారమే అజెండా’కు అనూహ్య స్పందన

Government Hospitals: రోగుల సంతృప్తే ప్రధానం

Read Latest AP News and Telugu News

Updated Date - Feb 06 , 2025 | 03:34 PM