Jammalamadugu: జగన్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి తోడు దొంగలు
ABN , Publish Date - Mar 30 , 2025 | 04:01 AM
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, మాజీ సీఎం జగన్‌రెడ్డి, కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిలు రాష్ట్రాన్ని ధ్వంసం చేశారని తీవ్ర విమర్శలు చేశారు. వివేకా హత్య కేసు త్వరలో వేగవంతం అవుతుందని, దోషులు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు.

వైఎస్ వివేకాను హత్యచేసి మాపై నిందలు
త్వరలో వేగవంతం కానున్న కేసు విచారణ
దోషులంతా కటకటాలు లెక్కించక తప్పదు: ఆదినారాయణరెడ్డి
కడప, మార్చి 29(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేసిన తోడు దొంగలు మాజీ సీఎం జగన్‌రెడ్డి, కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిలే అని జమ్మలమడుగు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆదినారాయణరెడ్డి అన్నారు. శనివారం కడప ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఒక్క చాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దోచుకోవడం, దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ప్రజలకు మంచి చేయాలనే తలంపుతో నాయకులు రాజకీయం చేస్తుంటారు. ఇందుకు పూర్తి విరుద్ధంగా జగన్‌రెడ్డి... ఎవరైనా ఎక్కడైనా చనిపోకపోతారా, పరామర్శ పేరుతో బయటకు రావచ్చు... అని అనుకోవడం తప్ప ప్రజల బాధలు గురించి ఏ మాత్రం ఆలోచనే లేదు. గతంలో వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయిన రోజున తొలుత గుండెపోటుతో చనిపోయారని చెప్పారు. గంట వ్యవధిలోనే హత్యకు గురయ్యారని, ఆ హత్య మేం చేశామని నిందలు మోపారు. ఆ విషయాలు ప్రజలందరికీ తెలుసు. అబద్ధాలను ప్రచారం చేయడం వారికి మొదటి నుంచి అలవాటుగా మారింది. వివేకా హత్య విషయంలో వాళ్లు వాళ్లు కొట్లాడుకుని మాపై ఆరోపణలు చేయడం దారుణం. స్వంత నియోజకవర్గానికి నీరు తెచ్చుకోలేని దౌర్భాగ్య స్థితికి చేరారు. పులివెందుల, కడప నుండి జగన్‌రెడ్డి, అనినాశ్‌రెడ్డిని ఓడించి తీరుతాం. వివేకా హత్య కేసు వేగవంతం కానుంది. త్వరలో దోషులంతా కటకటాలను లెక్కించక తప్పదు’ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu: ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం..
Minister Ramanaidu: ఏపీని ధ్వంసం చేశారు.. జగన్‌పై మంత్రి రామానాయుడు ఫైర్
Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. కొత్త తరహా మోసం
For More AP News and Telugu News