Polavaram Project: పోలవరం పూర్తే చంద్రబాబు లక్ష్యం
ABN , Publish Date - Apr 06 , 2025 | 02:50 AM
పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలన్నదే చంద్రబాబు లక్ష్యమని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. వైసీపీ పాలనలో నీటిపారుదల శాఖపై అవగాహన లేని వారిని మంత్రులుగా చేసి ప్రాజెక్టుకు నష్టం కలిగించారని ఆమె విమర్శించారు.

అమరావతి, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేయనున్నట్లు మాజీ మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తి చేసి నిర్దేశిత ఆయకట్టుకు నీరందించాలనేది చంద్రబాబు లక్ష్యం. రాష్ట్ర విభజన సమయంలో కన్నా వైసీపీ పాలనలోనే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది 2014-19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టుకు సుమారు రూ.11,762 కోట్లు ఖర్చు చేస్తే జగన్ పాలనలో కేవలం రూ.4,167 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. నీటిపారుదల శాఖపై అవగాహన లేని వారిని మంత్రులుగా చేసిన ఘనత జగన్‌దే’ అని సుజాత ఎద్దేవా చేశారు.
ఇవి కూడా చదవండి..
Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్
NEET Row: స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును నిరాకరించిన రాష్ట్రపతి
PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..
For National News And Telugu News