Tirumala: భక్తుల భద్రత బాధ్యత మీదే కదా?
ABN , Publish Date - Mar 22 , 2025 | 04:22 AM
తిరుపతి తొక్కిసలాట ఘటనపై శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్సు హాలులో సుమారు 3 గంటల పాటు బాధితులను, టీటీడీ విజిలెన్సు, పోలీసు, ఇతర అధికారులను జస్టిస్ సత్యనారాయణమూర్తి విచారించారు.

మరి తొక్కిసలాట ఎలా జరిగింది?
టీటీడీ పూర్వ సీవీఎస్వోకు కమిషన్ ప్రశ్నలు
నేటితో మూడో దశ విచారణ పూర్తి
తిరుపతి(కలెక్టరేట్), మార్చి 21(ఆంధ్రజ్యోతి): ‘తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత బాధ్యత మీదే కదా. ఆ సమయంలో మీరెక్కడ ఉన్నారు? పద్మావతి పార్కులోకి భక్తులను ఎలా పంపించారు? ఇది మీ నిర్ణయమా, పోలీసుశాఖ నిర్ణయమా’ అంటూ ఏకసభ్య న్యాయ విచారణ కమిషన్ జస్టిస్ సత్యనారాయణమూర్తి టీటీడీ పూర్వ సీవీఎస్వో శ్రీధర్‌పై ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం. తిరుపతి తొక్కిసలాట ఘటనపై శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్సు హాలులో సుమారు 3 గంటల పాటు బాధితులను, టీటీడీ విజిలెన్సు, పోలీసు, ఇతర అధికారులను జస్టిస్ సత్యనారాయణమూర్తి విచారించారు. ఆనాడు విధుల్లో ఉన్న టీటీడీ సీవీఎస్వో శ్రీధర్‌ను విచారిస్తూ.. ‘పార్కుకు ఎందుకు తాళాలు వేశారు? గేటు తెరవాల్సిన అవసరం ఏముంది? తెరిచే సమయంలో ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు’ అని ప్రశ్నించినట్టు తెలిసింది. ఇదే ఘటనలో సస్పెండైన డీఎస్పీ రమణకుమార్ తరపున లాయర్లు శ్రీధర్‌ను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఈ ఘటనలో సస్పెండైన డీఎస్పీ రమణకుమార్, ఎస్వీ గోశాల డైరెక్టర్ హరినాథ్‌రెడ్డిని శనివారం విచారించనున్నారు. దీంతో మూడో దశ విచారణ ప్రక్రియ ముగియనుంది.
ఇవి కూడా చదవండి:
Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు
Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా
MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే