Share News

సగిలేరుపై హైలెవల్‌ బ్రిడ్జి అంతేనా..?

ABN , Publish Date - Mar 21 , 2025 | 11:38 PM

సగిలేరు నదిపై హైలెవల్‌ బ్రిడ్జి నిర్మా ణం ఎప్పుడు చేపడతారోనని కాశినాయన మండలంలోని సుమారు ఐదు గ్రామాల ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

సగిలేరుపై హైలెవల్‌ బ్రిడ్జి అంతేనా..?
ఉప్పాగు వరదతో సగిలేరు వద్ద వాహనదారుల పాట్లు

టెండర్‌ పూర్తి అయినా ప్రారంభంకాని పనులు

జంగిల్‌ వర్క్‌చేసి నెలలు గడుస్తున్నా ముందుకు సాగని వైనం

కాశినాయన, మార్చి 21(ఆంధ్రజ్యోతి)సగిలేరు నదిపై హైలెవల్‌ బ్రిడ్జి నిర్మా ణం ఎప్పుడు చేపడతారోనని కాశినాయన మండలంలోని సుమారు ఐదు గ్రామాల ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వంలో పిట్టి గుంట బస్టాప్‌ నుంచి తెల్లబాడు క్రాస్‌ రోడ్డువరకు వరకు దాదాపు 9కి.మీ మేర రూ.10 కోట్ల ఖర్చుతో సగిలేరు నదిమీదుగా పాత కొత్త ఉప్పలూరు గ్రామాలను కలుపుతూ తారు రోడ్డువేశారు. కానీ మధ్యలో ఉన్న సగిలేరు నదిపై హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడంతో దూలంవారిపల్లె, కొం డపేట, తెల్లబాడు, పాత ఉప్పలూరు, కొత్తఉప్పలూరు తదితర గ్రామాల ప్రజలు రాకపోకలకు వీలుగాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోట్లు వెచ్చించి తారురోడు ్డవేసినా బ్రిడ్జి ఏర్పాటు చేయకపోవడంతో ప్రజల కష్టాలు తీరడంలేదు. ఇదిలా ఉండటా సగిలేరునదిపై బ్రిడ్డి నిర్మాణానికి రూ.10 కోట్లతో టెండర్‌ ఖరారుచేసి అగ్రిమెంట్‌ పూర్తిచ చేసి జంగిల్‌ వర్క్‌ కూడా చేపట్టారు. ఇంతలోపు సార్వత్రిక ఎన్నికలు రావడంతో బ్రిడ్జి నిర్మాణం విషయం మళ్లీ మొదటికి వచ్చినట్లైంది. దీంతో ఈప్రాంతవాసులు దశాబ్దాల నుంచి కోరుకుంటున్న బ్రిడ్జి నిర్మాణం కలగానే మిగిలిపోతుంది. దీంతో సగి లేరుకు వరదలు వచ్చిన ప్రతిసారి నది సమీపగ్రామాలైన పాత, ,కొత్త ఉప్ప లూరు ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎగువ ప్రాంతం నుంచి సీజనలో వచ్చే వరదల మూలంగా వారాల తరబడి నదిలో రాకపోకలు నిలిచిపోయి వ్యవసాయానికి తీవ్ర ఆటంకం ఏర్పడుతోం దని గ్రామస్థులు వాపోతున్నారు. పంటలు చేతికి వచ్చేసమయంలో సగిలేరు కు వరదలు వస్తే పైగ్రామాల పరిస్థితి వర్ణాతీతంగా ఉంటుంది. కనీసం పంట చేలను పరిశీలించివద్దామనుకున్నా రైతులకు వీలుకాదు. ఎన్నికల సమయంలో బద్వేల్‌ టీడీపీ సమన్వయకర్త పార్టీ యువ నాయకుడు రితీష్‌రెడ్డి పాదయాత్ర సమయంలో ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే బ్రిడ్జి నిర్మాణం తప్పక చేపడతామని ప్రజలకు హామీఇచ్చారు. ఇప్పటికైనా సంబందిత అధికారులు, ఈప్రాంత అధికార పార్టీ నేతలు చొరవ తీసుకొని బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తిఅయ్యేలా చూడాలని పలువురు కోరుచున్నారు.

త్వరలో పనులు ప్రారంభిస్తాం

ఉప్పలూరు వద్ద సగిలేరు నదిపై హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణానికి రూ9.5 కోట్లతో అగ్రిమెంటు పూర్తి అయింది. వర్షాలు మొదలు కాక ముందే పనులు ప్రారంభించాలని కృషిచేస్తున్నాం. సాధ్యమైనంత తొందరగా పనులు మొదలు పెట్టేందుకు చర్యలు తీసుకుంటాం.

- నరసింహారెడ్డి, పీఆర్‌ డీఈ, బద్వేలు డివిజన

Updated Date - Mar 21 , 2025 | 11:38 PM

News Hub