Share News

Gangalur Encounter: గంగలూరు ఎన్‌కౌంటర్‌ పక్కా సమాచారంతోనే

ABN , Publish Date - Mar 22 , 2025 | 06:25 AM

ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన 26 మంది మావోయిస్టుల్లో 14 మంది మహిళలు ఉన్నారన్నారు. వారిలో ఇప్పటి వరకూ 18 మందిని గుర్తించినట్లు చెప్పారు. డీవీసీఎం సభ్యుడు ముక్తిపై రూ.8 లక్షలతోపాటు వీరందరిపై రూ.1.03 కోట్ల రివార్డు ఉందన్నారు.

Gangalur Encounter: గంగలూరు ఎన్‌కౌంటర్‌ పక్కా సమాచారంతోనే

చర్ల, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): పక్కా సమాచారంతోనే గంగలూరు ఎన్‌కౌంటర్‌ జరిగిందని బస్తర్‌ ఐజీ సుందర్‌ రాజ్‌ చెప్పారు. ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన 26 మంది మావోయిస్టుల్లో 14 మంది మహిళలు ఉన్నారన్నారు. వారిలో ఇప్పటి వరకూ 18 మందిని గుర్తించినట్లు చెప్పారు. డీవీసీఎం సభ్యుడు ముక్తిపై రూ.8 లక్షలతోపాటు వీరందరిపై రూ.1.03 కోట్ల రివార్డు ఉందన్నారు. మరోవైపు, అబూజ్‌మడ్‌ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు నక్సల్స్‌లో ఒక మహిళ ఉన్నారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన రాజు ఓయాం(27) అనే డీఆర్‌జీ జవాన్‌, యువకుడికి ఐజీ, ఎస్‌పీ నివాళులర్పించారు. గంగలూరు ఎన్‌కౌంటర్‌ బూటకం అని పౌరహక్కుల సంఘం ఆరోపించింది. ఆపరేషన్‌ కగార్‌ను నిలిపేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, ప్రధాన కార్యదర్శి నారాయణ రావు డిమాండ్‌ చేశారు.

Updated Date - Mar 22 , 2025 | 06:25 AM