Rahul Gandhi: ‘ప్రతిభ’ అనే భావనే అనుచితం
ABN , Publish Date - Mar 22 , 2025 | 06:15 AM
ప్రతిభ అనే భావనే అనుచితమని.. అగ్ర కులాల కథనమని.. పూర్తిగా లోపభూయిష్టమని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ అన్నారు. భారతీయ విద్యావ్యవస్థ బడుగు వర్గాలకు అన్యాయం చేసిందన్నారు. యూజీసీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ సుఖ్‌దేవ్ థోరట్‌తో తాను జరిపిన సంభాషణను రాహుల్ శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. పరిపాలన, విద్యా రంగాల్లో సమానావకాశాల కోసం దళితులు, గిరిజనులు ఇప్పటికీ పోరాడుతున్నారని ఆయన తెలిపారు. భారత్‌లో అసమానతల వెనుక నిజాన్ని వెలికితీసేందుకు కులగణన ముఖ్యమన్నారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడింది

న్యూఢిల్లీ, మార్చి 21: ప్రతిభ అనే భావనే అనుచితమని.. అగ్ర కులాల కథనమని.. పూర్తిగా లోపభూయిష్టమని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ అన్నారు. భారతీయ విద్యావ్యవస్థ బడుగు వర్గాలకు అన్యాయం చేసిందన్నారు. యూజీసీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ సుఖ్‌దేవ్ థోరట్‌తో తాను జరిపిన సంభాషణను రాహుల్ శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. పరిపాలన, విద్యా రంగాల్లో సమానావకాశాల కోసం దళితులు, గిరిజనులు ఇప్పటికీ పోరాడుతున్నారని ఆయన తెలిపారు. భారత్‌లో అసమానతల వెనుక నిజాన్ని వెలికితీసేందుకు కులగణన ముఖ్యమన్నారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడింది. ప్రతిభ వ్యతిరేక మనస్తత్వం ప్రమాదకరమని, కుటుంబవాదులు, వంశపారంపర్య మనస్తత్వం కలిగినవారు ఎన్నటికీ ప్రతిభను గౌరవించరని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ విమర్శించారు. ఇదిలా ఉండగా, ‘మనం బీజేపీ, ఆరెస్సె్‌సతోనే కాదు..భారత రాజ్యంపైనే పోరాటం చేస్తున్నాం’ అన్న వ్యాఖ్యల కేసులో సంభాల్ కోర్టు రాహుల్‌కు సమన్లు జారీ చేసింది. ఏప్రిల్4న హాజరు కావాలని, లేదంటే సమాధానమైనా పంపించాలని జిల్లా కోర్టు ఆదేశించింది. ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ సిమ్రన్ గుప్త అనే వ్యక్తి కేసు వేశారు.
ఇవి కూడా చదవండి:
Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు
Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా
MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే