Share News

గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు పనులు

ABN , Publish Date - Mar 20 , 2025 | 11:36 PM

గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు గ్రామంలో పను లు నిర్వహించాల్సి ఉంటుందని ఈవోఆర్డీ రం తుల్లయ్య పేర్కొన్నారు.

గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు పనులు
ఇరువర్గాలతో మాట్లాడుతున్న ఈవోఆర్డీ తదితరులు

ఎర్రగుంట్ల, మార్చి 20(ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు గ్రామంలో పను లు నిర్వహించాల్సి ఉంటుందని ఈవోఆర్డీ రం తుల్లయ్య పేర్కొన్నారు. మాలేపాడు గ్రామ సచివాలయంలో గురువారం ఆయన వార్డు సభ్యులు, గ్రామ సచివాలయ సిబ్బంది, ఇరువ ర్గాల వారిని పిలిపించి మాట్లాడారు. పంచాయతీ తీర్మానమే శాసనమని, దాన్ని అతిక్రమిస్తే చట్టప రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీపీవో రాజ్యలక్ష్మి అనుమతి తీసుకుని త్వరలో గ్రామపంచాయతి సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని, అప్పటి వరకు నీట సమస్య తలెత్తకుండా ఒక మనిషిని ఏర్పాటుచేసి వదులుతామన్నారు. కాగా గ్రామంలో తాగునీటి విషయంపై సర్పంచి, టీడీపీ వారి మధ్య ఏర్పడిన విభేదాలు తారాస్థాయికి చేరాయి. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడి డీఎస్పీ దృష్టికి వెళ్లడంతో గ్రామంలో ఎస్‌ఐ ఆధ్వర్యంలో పికెటింగ్‌ ఏర్పాటు చేశారు.

Updated Date - Mar 20 , 2025 | 11:36 PM