నిరుద్యోగులకు అండగా ప్రభుత్వం
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:02 AM
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా నిలుస్తోందని రాయచోటి నియోజకవర్గ టీడీపీ నాయకుడు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్‌రెడ్డి అన్నారు.

రాయచోటిటౌన,మార్చి21(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా నిలుస్తోందని రాయచోటి నియోజకవర్గ టీడీపీ నాయకుడు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రాయచోటి పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల కు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో మెగా జాబ్ మేళా ని ర్వహిస్తోందన్నారు. అన్నమయ్య జిల్లాలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సహకారంతో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహిస్తామన్నారు. జాబ్ మేళాకు హాజరైన వారికి భోజన వసతి కల్పించారు.