Share News

బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం

ABN , Publish Date - Mar 26 , 2025 | 11:51 PM

బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని , 18 సంవత్సరాలు నిండిన తరువాతే ఆడపిల్లలకు వివాహం చేయాలని లక్కిరెడ్డిపల్లె ఐసీడీఎస్‌ సీడీపీవో పద్మావతి సూచించారు.

బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం
కిశోర వికాసం కార్యక్రమంలో మాట్లాడుతున్నలక్కిరెడ్డిపల్లె ఐసీడీఎస్‌ సీడీపీవో పద్మావతి

గాలివీడు, మార్చి26(ఆంధ్రజ్యోతి): బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని , 18 సంవత్సరాలు నిండిన తరువాతే ఆడపిల్లలకు వివాహం చేయాలని లక్కిరెడ్డిపల్లె ఐసీడీఎస్‌ సీడీపీవో పద్మావతి సూచించారు. బుధవారం నూలివీడు పం చాయతీ కేంద్రంలోని సచివాలయంలో అంగన్వాడీ టీచర్లతో కిశోర వికాసం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్యవివాహాల వల్ల అనర్థాలతో పాటు రక్తహీనత, శిశు మరణాలు, మాతృమరణా లు సంభవిస్తాయన్నారు. అంగన్వాడీ సూపర్‌వైజర్లు సుజాతరెడ్డి, అరుణకుమారి, టీచర్లు, వర్కర్లు పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2025 | 11:51 PM