పనిముట్లు లేకుంటే ఎలా పనిచేయాలి ?
ABN , Publish Date - Mar 28 , 2025 | 12:06 AM
పనిముట్లు లేకుంటే ఎలా పనిచేయాలని పారిశుధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

పారిశుధ్య కార్మికుల ఆవేదన
సిద్దవటం, మార్చి 27 (ఆంధ్రజ్యోతి) : పనిముట్లు లేకుంటే ఎలా పనిచేయాలని పారిశుధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మండలంలోని మాధవరం-1 గ్రామం వెంకటేశ్వరపురంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయ హరితరాయబారులు మాట్లాడుతూ స క్రమంగా పనిచేయాలంటే పనిముట్లు ఉండాలని కదా అ న్నారు. అనంతరం గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసి న సమీక్ష సమావేశంలో వెంకటేశ్వరపురం గ్రామ నీటి సమస్యను విన్నవించారు. ఎంపీడీవో ఫణిరాజకుమారి మాట్లాడుతూ నీటి సమస్యను ఐదు రోజుల్లోపు పరిష్కరిస్తామన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ గురుప్రసాద్, ఏపీవో నరసింహులు, టీడీపీ నియోజకవర్గ ముస్లిం మైనార్టీ నేత డాక్టర్ వీరభద్రుడు, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనరసయ్య, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.