విద్యుత వినియోగదారులకు సత్వర న్యాయం
ABN , Publish Date - Mar 26 , 2025 | 11:49 PM
ఏపీఈఆర్‌సీ వారు నిర్ధేశించిన ప్రకారం సేవలు నిర్వర్తింపక అమలులో జాప్యాన్ని పరిశీలించి సీజీఆర్‌ఎఫ్ వినియోగదారులకు సత్వర న్యాయం అందిస్తుందని సీ జీఆర్‌ఎఫ్ చైర్మన శ్రీనివాస ఆంజనేయమూర్తి తెలిపారు.

ఒంటిమిట్ట, మార్చి 26 (ఆంధ్రజ్యోతి) : ఏపీఈఆర్‌సీ వారు నిర్ధేశించిన ప్రకారం సేవలు నిర్వర్తింపక అమలులో జాప్యాన్ని పరిశీలించి సీజీఆర్‌ఎఫ్ వినియోగదారులకు సత్వర న్యాయం అందిస్తుందని సీ జీఆర్‌ఎఫ్ చైర్మన శ్రీనివాస ఆంజనేయమూర్తి తెలిపారు. బుధవా రం ఒంటిమిట్టలో ప్రత్యేక విద్యుత అదాలత కార్యక్రమాన్ని నిర్వహించారు. వినియోగదారులు తమ సమస్యలను ఈ ఫోరం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు. 9 మంది వినియోగదారులు పలు సమస్యలపై ఫిర్యాదులు చేశారు. రెండు నెలల్లో ఈ సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. సీజీఆర్‌ఎఫ్ సభ్యులు రామ్మోహనరావు, అంజనికుమార్, విజయలక్ష్మీ, విద్యుతశాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ నాయక్, ఏఈ పాల్గొన్నారు.