Share News

MP Mithun Reddy: హైకోర్టులో ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్

ABN , Publish Date - Mar 20 , 2025 | 10:15 PM

MP Mithun Reddy: వైసీపీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి గురువారం నాడు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేస్తారని వార్తలు రావడంతో ఆయన వెంటనే హైకోర్టుకు వెళ్లి తనకు బెయిల్ ఇవ్వాలని కోరారు.

MP Mithun Reddy: హైకోర్టులో ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్
MP Mithun Reddy

అమరావతి: వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వ్యవహారంలో వైసీపీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఇవాళ (గురువారం) హైకోర్టును ఆశ్రయించారు. గత ఏడాది సెప్టెంబర్ 23వ తేదీన సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసులో మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ అనుబంధ పిటిషన్‌ వేశారు. ఈ కేసులో తనను నిందితుడిగా చేర్చినట్లు మీడియాలో కథనాలు వచ్చాయని అన్నారు.


ఈ సందర్భంగా మద్యం కుంభకోణంలో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని ఎంపీ మిథున్ రెడ్డి చేసిన విజ్ఞప్తిని ఏపీ హైకోర్ట్ తోసిపుచ్చింది. మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్ట్‌లో మిథున్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్ట్ విచారణ జరిపింది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని, ఏ క్షణంలోనైనా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని న్యాయవాది నిరంజన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల మిథున్ రెడ్డికి అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని న్యాయవాది కోరారు. సీఐడీ కేసు వివరాలు సమర్పించాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్ట్ ఆదేశించింది. ఈ కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది.


ఈ వార్తలు కూడా చదవండి...

Marri Rajasekhar: జగన్ అలా చేయడం తీవ్రంగా బాధించింది

Pawan Kalyan : ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే.. వారే కారణం

Tirumala: తిరుమలలో భక్తుల మధ్య ఘర్షణ.. ఒకరికి గాయాలు

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Mar 20 , 2025 | 10:19 PM