Payyavula Keshav: లోకేష్.. ఈ వీడియో మీ అమ్మకు చూపించూ..
ABN , Publish Date - Mar 20 , 2025 | 10:07 PM
Payyavula Keshav: విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఎమ్మెల్యేల సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. వీటిని సీఎం చంద్రబాబు చక్కగా ఆస్వాదించారు. ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.

అమరావతి, మార్చి 20: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పని అనేది ఓ వ్యసనమని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. 1994 నుంచి చంద్రబాబులో బాధ, కోపం, ఆనందం చూశా కానీ.. ఇంతలా నవ్వడం ఈ రోజే చూశానని తెలిపారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు మనసారా నవ్విన వీడియోను ఆయన సతీమణి భువనేశ్వరికి చూపించాలని మంత్రి నారా లోకేష్‌కు కోరుతున్నానన్నారు. తమ ఇంటి సమస్యలే తీసుకున్నారా? అని ప్రతి ఎమ్మెల్యే అనుకునేలా ఇదీ సంగతి ప్రదర్శన ఉందని చెప్పారు. దశాబ్దాల పాటు జరిగే ఈ తరహా కార్యక్రమాల్ని మనమే నిర్వహిస్తామన్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. గబ్బర్ సింగ్ సినిమాలో పోలీస్‌స్టేషన్ సీన్‌ను తలపించేలా కామెడీ సాగిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇంతలా నవ్వటం తన జీవితంలో ఇంత వరకు చూడ లేదని చెప్పారు. చంద్రబాబును మనసారా నవ్వించిన సభ్యులందరికీ ఈ సంద్భంగా ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం తర్వాత కూడా కొన్ని రోజుల పాటు నవ్వుకునే అనుభూతిని సభ్యులు కల్గించారని పేర్కొన్నారు. గత ఐదేళ్లు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంటే కక్షలు,దాడులు,విధ్వంసం అన్నట్లుగా సాగిందని గుర్తు చేశారు. తనకున్న సహజ హాస్య చతురతతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అయ్యన్నపాత్రుడుకి పవన్ అభినందనలు చెప్పారు. పార్టీలు మర్చిపోయి ప్రజాప్రతినిధులు అంతా ఏకమై చేసిన ఈ కార్యక్రమం దేశానికే స్పూర్తి అని డిప్యూటీ సీఎం పవన్ అభిప్రాయపడ్డారు.
శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. చట్టసభల సభ్యులకు క్రీడా, వినోద కార్యక్రమాల సoస్కృతిని ఎన్టీఆర్ ప్రారంభిస్తే, వాటిని సీఎం చంద్రబాబు ప్రోత్సహించారన్నారు. 83లో జరిగిన సాంస్కృతిక పోటీల్లో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ దుర్యోధనుడి పాత్ర పోషించి మొదటి బహుమతి కూడా పట్టేశారని చెప్పారు. వచ్చే ఏడాది సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పోటీల్లో పాల్గొనాలని కోరారు. మహిళ సభ్యులు సైతం తమ క్రీడా స్ఫూర్తి చాటారని పేర్కొన్నారు.ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించడంలో మంత్రులు రామ్ ప్రసాద్ రెడ్డి, కందుల దుర్గేష్, శాప్ చైర్మర్ రవి నాయుడు తెరవెనుక కృషి ఎంతో చేశారని ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న ప్రస్తావించారు.
Also Read:
CM Chandrababu Naidu: వీరంతా శాశ్వత ఎమ్మెల్యేలు కావాలి
Marri Rajasekhar: జగన్ అలా చేయడం తీవ్రంగా బాధించింది
Pawan Kalyan : ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే.. వారే కారణం
Nirmala Sitharaman: ఏప్రిల్ 1 నుంచి రానున్న మార్పులివే...
CM Nitish Kumar: అసెంబ్లీలో ఏమిటిది అధ్యక్ష్యా..
Toothpick: టూత్‌పిక్‌తో దంతాలను శుభ్రం చేస్తే.. ఇంత డేంజరా?
Tirumala: తిరుమలలో భక్తుల మధ్య ఘర్షణ.. ఒకరికి గాయాలు
Badar Khan Suri : అమెరికాలో భారతీయుడిపై బహిష్కరణ వేటు
For More Andhra Pradesh News and Telugu News..