Share News

అనధికార స్థలాలను క్రమబద్ధీకరించుకోవాలి

ABN , Publish Date - Mar 20 , 2025 | 11:34 PM

పురపాలక సంఘం పరిధిలోని అనధికార స్థలాలను క్రమబద్ధీకరించుకోవాలని ఆర్డీవో చంద్రమోహన సూచించారు.

అనధికార స్థలాలను క్రమబద్ధీకరించుకోవాలి
క్రమబద్ధీకరణపై ప్రజలకు వివరిస్తున్న ఆర్డీవో, మున్సిపల్‌ కమిషనర్‌

బద్వేలు, మార్చి 20 (ఆంధ్ర జ్యోతి): పురపాలక సంఘం పరిధిలోని అనధికార స్థలాలను క్రమబద్ధీకరించుకోవాలని ఆర్డీవో చంద్రమోహన సూచించారు. పట్టణంలోని రిక్షాకాలనీ, సుందరయ్య కాలనీలలో గురువారం ఆర్డీవో చంద్రమోహన, మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహారెడ్డిలతో కలిసి పర్య టించి ప్రజలతో మాట్లాడారు. 2019 అక్టోబరు 15వ తేది నాటికి అనధికార ఆక్రమణ సలం లో నివాసగృహం నిర్మించి నివసిస్తున్న వారు కుటుంబంలోని మహిళ పేరుతో క్రమబద్ద్ధీకరణ చేసుకోవాలన్నారు. లబ్ధిదారుల కుటుంబం ఏ సభ్యుడైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలో గృహనిర్మాణ పథకంలో లబ్ధ్ది పొందరాదని, స్వంత ఇళ్లు, ఇంటిస్థలం ఉండకూడదన్నారు. ఆవిధంగా లేనివారు ఈ పథకానికి అనర్హులవుతారన్నారు.

Updated Date - Mar 20 , 2025 | 11:34 PM