ఫారంపాండ్లతో భూగర్భ జలాలు వృద్ధి
ABN , Publish Date - Mar 22 , 2025 | 11:22 PM
ఫారంపాండ్ల ఏర్పాటుతో భూగర్భజలాలు వృద్ధిచెందుతాయని కుడా చైర్మన, రై ల్వేకోడూరు టీడీపీ ఇనచార్జ్ ముక్కా రూపానందరెడ్డి తెలిపారు.

రైల్వేకోడూరు రూరల్, మార్చి 22(ఆంధ్రజ్యోతి): ఫారంపాండ్ల ఏర్పాటుతో భూగర్భజలాలు వృద్ధిచెందుతాయని కుడా చైర్మన, రై ల్వేకోడూరు టీడీపీ ఇనచార్జ్ ముక్కా రూపానందరెడ్డి తెలిపారు. శనివారం అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా కోడూరు మండలంలోని కె.బుడుగుంటపల్లె పంచాయతీలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఫారంపాండ్‌కు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఉపాధిహామీ పథక అదనపు ప్రోగ్రాం అధికారి మృత్యుంజయ రావు మాట్లాడుతూ మండలంలో 484 ఫారంపాండ్స్ జూన ఆఖరి లోపు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు ప్రారంభించామన్నారు. పంచాయతీ సర్పంచ చంద్రశేఖర్, టీడీపీ నాయకులు తిరుపతి చంద్రశేఖర్, సుబ్బరామరాజు, సిద్ధేశ్వర, తాతంశెట్టి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
నీటి గుంతలతో భూగర్భజలాలను వృద్ధి చేద్దాం
సంబేపల్లె, మార్చి22(ఆంధ్రజ్యోతి): నీటి గుంతల ఏర్పాటుతో భూగర్భజలాలను వృద్ధి చేద్దాం అని టీడీపీ మాజీ జెడ్పీటీసీ నాయకులు మల్లు నరసారెడ్డి, ఎంపీడీవో రామచంద్ర తెలిపారు. శనివారం ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా పెద్దబిడికీలో ఫారం పాండ్ గుంతల పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పొలాల వద్ద ఫారం పాండ్ గుంతలను ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఈ గుంతల ద్వారా భూగర్భజలాలు పెరుగుతాయని వాలు ప్రాంతంలో ఫారం పాండు ఏర్పాటు చేసుకోవాలని రైతులకు తెలిపారు. ఉపాధి ఏపీవో రెడ్డిజవహర్, మాజీ డీసీసీబీ డైరెక్టర్ మల్లు విష్ణువర్థనరెడ్డి, యువగళం సభ్యులు మండిపల్లి సిద్దారెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు.
నీటిని వృథా చేయవద్దు
సుండుపల్లె, మార్చి22 (ఆంధ్రజ్యోతి): నీటిని వృథా చేయవద్దని ఆర్‌హెచజీబీ ఎంఎ్‌సఎస్ సంస్థ ప్రతినిధులు నరసింహులు, చంద్రానాయక్ తెలిపారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నీటి ప్రాముఖ్యతను వివరించారు. నీటి వనరులను ఒడిపి పట్టడం, నీటిని వృధా చేయకుండా ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే విషయాలపై రైతులకు తెలియజేశామన్నారు. నాబార్డు ప్రతినిధులు రైతులకు ఉపయోగపడే పుస్తకాలను అందజేశారు.
నీటిపారుదల రంగానికి అగ్ర తాంబూలం
రాజంపేట, మార్చి 22 (ఆంధ్రజ్యోతి) : రైతులకు ఉపయోగపడే నీటిపారుదల రంగానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆ ధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అగ్ర తాంబూలం కల్పిస్తోందని టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు చమర్తి జగనమోహనరాజు పేర్కొన్నారు. శనివారం రాజంపేట మండలం ఊటుకూరులో రైతు రాయపురాజు పెంచల్‌రాజు పొలంలో జాతీయ ఉపాధి హామీ పథ కం కింద నీటికుంటల నిర్మాణానికి భూమిపూజ చేశా రు. వర్షపు నీటిబొట్టును వొడిసి పట్టి వేసవి కాలంలో ఈ సేద్యపు కుంటలను ఏర్పాటు చేసి వర్షాకాలపు నీటిని నిల్వ ఉంచడం వల్ల భూగర్భజలాలు గణనీయంగా పెరుగుతాయన్నారు. ఏపీవో బాలయ్య, జేఈ మీనాకుమారి, మండల పార్టీ అధ్యక్షులు గన్నే సుబ్బనరసయ్యనాయుడు, మాజీ అధ్యక్షుడు కోవూరు సుబ్రమణ్యంనాయుడు, పార్లమెంట్ కార్యదర్శి కొండా శ్రీనివాసులు, పెంచల్‌రాజు పాల్గొన్నారు.