AP High Court: జాతీయ క్రీడల జరుగుతోన్న వేళ.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు
ABN , Publish Date - Jan 29 , 2025 | 04:44 PM
AP High Court: ఉత్తరాఖండ్ వేదికగా జాతీయ క్రీడలు ప్రారంభమైనాయి. అలాంటి వేళ ఏపీ హైకోర్టులోని డివిజన్ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది.

అమరావతి, జనవరి 29: రాష్ట్ర ఒలింపిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా పురుషోత్తం నియామకంపై గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్‌ను ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ బుధవారం సస్పెండ్ చేసింది. గతంలో తనను తానే ఏపీ ఒలంపిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా పురుషోత్తం ప్రకటించుకొన్నారు. ఈ నియామకాన్ని సవాల్ చేస్తూ.. ఏపీ కబడ్డీ సెక్రటరీ శ్రీకాంత్‌తోపాటు పలు క్రీడా సంఘాలకు చెందిన వారు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ క్రమంలో ఫెడరేషన్, ఏపీ కబడ్డీ క్రీడా సంఘాలకు ప్రభుత్వ గుర్తింపుతోపాటు ఫెడరేషన్ గుర్తింపు ఉందని ప్రధాన న్యాయమూర్తి దృష్టికి పిటిషనర్ తరుపు న్యాయవాది గంటా రామారావు తీసుకు వెళ్లారు. పురుషోత్తంకు ఎటువంటి గుర్తింపు లేదన్న ఈ సందర్భంగా ప్రధాని న్యాయమూర్తి ఎదుట పిటిషనర్ తరుపు న్యాయవాది స్పష్టం చేశారు.
అనంతరం పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏకీభవించారు. అలాగే క్రీడాకారులకు ప్రభుత్వం ఎటువంటి సహకారం అందిస్తుందంటూ న్యాయమూర్తి ప్రశ్నించగా.. జాతీయ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు ట్రావెలింగ్ ఎలవెన్స్, డైట్ అలవెన్స్, కోచింగ్, క్యాంపుల నిధులతోపాటు క్రీడా పరికరాలను సైతం ఏపీ ప్రభుత్వం సమకూర్చినట్లు హైకోర్టుకు క్రీడా సంఘాలు తెలిపాయి.
ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టులోని డివిజన్ బెంచ్ పై విధంగా తీర్పు వెలువరించింది. ఇక హైకోర్టు తీర్పుపై ఏపీ కబడ్డీ సెక్రటరీ శ్రీకాంత్ హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు ఉత్తరాఖండ్‌లో 38వ జాతీయ క్రీడలు మంగళవారం అంటే.. జనవరి 28వ తేదీన ప్రారంభమైనాయి. అలాంటి వేళ.. ఈ వ్యవహారంపై ఏపీ హైకోర్టులో విచారణ జరపడం ప్రాధాన్యత సంతరించుకొంది.
Also Read: హైకోర్టు తీర్పుపై స్పందించిన జ్యోతి సురేఖ
డెహ్రడూన్‌లో ఈ క్రీడలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఈ క్రీడలు జరగనున్నాయి. ఉత్తరాఖండ్‌లోని ఎనిమిది జిల్లాల్లోని మొత్తం 11 నగరాల వేదికగా ఈ క్రీడలు జరగనున్నాయి. మొత్తం 17 రోజుల పాటు జరుగుతోన్న ఈ క్రీడల్లో 36 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని క్రీడాకారులు ఈ జాతీయ క్రీడల్లో పాల్గొనున్నారు.
Also Read: పంచగ్రామాల ప్రజలకు గుడ్ న్యూస్
35 క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. వీటిలో 33 క్రీడలకు పతకాలు ప్రదానం చేయనున్నారు. ఈ ప్రాంభ వేడుకలకు భారత ఒలింపిక్స్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
For AndhraPradesh News And Telugu News