Share News

హామీల అమలుకు కూటమి చర్యలు

ABN , Publish Date - Mar 29 , 2025 | 12:34 AM

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ తెలిపారు.

హామీల అమలుకు కూటమి చర్యలు
ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌

హామీల అమలుకు కూటమి చర్యలు

ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌

పటమట, మార్చి 28 (ఆంధ్ర జ్యోతి): అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ తెలిపారు. శుక్రవారం 13వ డివిజన్‌ జేడీనగర్‌ వాటర్‌ ట్యాంక్‌ ఏరియాలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. డివిజన్‌లో ముగ్గురికి రెండు తోపుడు బండ్లు, ఒక కుట్టుమిషన్‌ను అందించారు. ఏప్రిల్‌లో దివ్యాంగులకు సదరన్‌ సర్టిఫికెట్లు అందిస్తామన్నారు. మేలో తల్లికి వందనంతో పాటు వ్యవసాయదారులకు రైతు పెట్టుబడి సాయం అందించేందుకు చర్యలు సిద్ధం చేస్తున్నారన్నారు. ఏపీఐఐసీ కాలనీ వాసులకు తాగునీరు అందించేందుకు ఒక ప్రాజెక్టు రూపొందించి కౌన్సిల్‌లో పెట్టామన్నారు. ఈ అంశంపై సీఎస్‌తో, ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు చెప్పారు. కార్పొరేటర్‌ ముమ్మనేని ప్రసాద్‌, గద్దె ప్రసాద్‌, కొర్రపాటి శ్రీను, నూతి శ్రీను, ముమ్మనేని మానస, దూళిపాళ్ల హరిత, నిడమానురు లోకేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2025 | 12:34 AM