శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడండి
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:22 AM
నియోజకవర్గంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా చూడాలని, విఘాతం కలిగించేవారు ఎంతటి వారైనా ఉపేక్షించొద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని సీఐలకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సూచించారు.

సీఐలకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సూచన
గుడివాడ, మార్చి 21(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా చూడాలని, విఘాతం కలిగించేవారు ఎంతటి వారైనా ఉపేక్షించొద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని సీఐలకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సూచించారు. శుక్రవారం రాజేంద్రనగర్‌లోని తన స్వగృహం లో పట్టణ, రూరల్ సీఐలు కొండపల్లి శ్రీనివాస్, సీహెచ్ నాగప్రసాద్, ఎస్‌ఎల్‌ఆర్ సోమేశ్వరరావుతో ఆయన సమావేశమయ్యారు. గంజాయి, బెట్టింగ్ అరికట్టడంపై చర్చించారు. ప్రజలను ఇబ్బంది పెట్టే అరాచక శక్తులను అణిచివేయాలని, గంజాయి, క్రికెట్ బెట్టింగ్‌లకు యువత బానిస కాకుండా పోలీసులు ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. రౌడీషీటర్ల కదలికపై ని ఘా ఉంచామని, గంజాయి, క్రికెట్ బెట్టింగ్‌ల కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని సీఐలు శ్రీనివాస్, నాగప్రసాద్ తెలిపారు. టిడ్కో కాలనీలో అసాంఘిక శక్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక పోలీస్ టీమ్‌ను ఏర్పా టు చేశామని రూరల్ సీఐ సోమేశ్వరరావు తెలిపారు. టిడ్కో, ఎన్టీఆర్ కాలనీల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటుచేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు.
గుడివాడలో నీటి ఎద్దడి రాకుండా చూడండి
మునిసిపల్ అధికారులకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆదేశం
పట్టణంలో వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చూడాలని, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధి కారులను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆదేశించారు. శుక్రవారం రాజేంద్ర నగర్‌లోని తన స్వగృహంలో మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. శివారు ప్రాంతాలకూ తాగునీరు అందేలా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. కమిషనర్ బి.శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు, ఇంజినీర్ ప్రసాద్ పాల్గొన్నారు.