Share News

మర్యాదపూర్వక కలయిక

ABN , Publish Date - Apr 04 , 2025 | 12:28 AM

రవాణాశాఖ అదనపు కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎల్‌ఎస్‌ఎం రమ్యశ్రీని రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోన్‌-2 కార్యవర్గసభ్యులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.

మర్యాదపూర్వక కలయిక
ఏటీసీ రమ్యశ్రీని కలిసిన రవాణా శాఖ జోన్‌-2 ఉద్యోగ సంఘ నాయకుల్చు

మర్యాదపూర్వక కలయిక

కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): రవాణాశాఖ అదనపు కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎల్‌ఎస్‌ఎం రమ్యశ్రీని రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోన్‌-2 కార్యవర్గసభ్యులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రమ్యశ్రీ మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించి సమస్యలు ఏమున్నా కూడా మా దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరిచేందుకు కృషి చేస్తానని అన్నారు. జోన్‌-2 ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎం.రాజుబాబు మాట్లాడుతూ అదనపు రవాణా కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన రమ్యశ్రీని కలిసినందుకు ఎంతో సంతోషంగా వుందన్నారు. ఈ కార్యక్రమంలో రవాణాశాఖ ఉద్యోగులు డి.రామ్మూర్తి, వి.నాగశంకర్‌, ప్రియాంక, రామచంద్రరాజు, బి.మధుసూదన్‌, పి.దుర్గాప్రసాద్‌, కె.సత్యనారాయణ తదితరులున్నారు.

Updated Date - Apr 04 , 2025 | 12:28 AM