Share News

కరెన్సీనగర్‌ సమస్యలపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Mar 22 , 2025 | 12:22 AM

తూర్పు పరిధి 3వ డివిజన్‌లోని కరెన్సీ నగర్‌లోని ప్రధాన సమస్యలన్నింటిని పరిష్కరించి సుందరమైన డివిజన్‌గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ హామీ ఇచ్చారు.

కరెన్సీనగర్‌ సమస్యలపై ప్రత్యేక దృష్టి
కాలనీవాసుల సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌

కరెన్సీనగర్‌ సమస్యలపై ప్రత్యేక దృష్టి

ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌

భారతీనగర్‌, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): తూర్పు పరిధి 3వ డివిజన్‌లోని కరెన్సీ నగర్‌లోని ప్రధాన సమస్యలన్నింటిని పరిష్కరించి సుందరమైన డివిజన్‌గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ శుక్రవారం కరెన్సీ నగర్‌ కాలనీలో పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన స్థానికులతో మాట్లాడి ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రూ.31లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులకు గద్దె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3వ డివిజన్‌లో అభివృద్ధి చెందాల్సిన ప్రాంతాలు చాలా ఉన్నాయన్నారు. అందువల్ల తాను ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పి ఈ డివిజన్‌ను దత్తత తీసుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు, ముమ్మనేని ప్రసాద్‌, టీడీపీ నాయకులు బాయన బాబ్జి, తాడి బాబూరావు, గద్దె రమేష్‌, ధనేకుల యలమందరావు, బండి కోమలి, బొప్పన మోహనరావు, పి.పిచ్చిరెడ్డి, కృష్ణప్రసాద్‌, కార్పొరేషన్‌ ఈఈ సామాజ్య్రం, ఏఈ దీక్షిత్‌ పాల్గొన్నారు.

అగ్ని బాధితులకు గద్దె పరామర్శ

పటమట: తూర్పు పరిధి 14వ డివిజన్‌లో విద్యుత్‌ షార్ట్‌ సర్య్కూట్‌ వల్ల అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని, బాధితుల ఇళ్లనుఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ పరిశీంచారు. బాధితురాలు ప్రశాంతికి రూ.10 వేలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. నర్రా కిషోర్‌, ముమ్మనేని ప్రసాద్‌, గరికపాటి బద్రీ, ఎల్లబాబు పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2025 | 12:22 AM