Share News

మాటకు కట్టుబడిన ప్రభుత్వం

ABN , Publish Date - Apr 03 , 2025 | 12:41 AM

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత చార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచకుండా పాలన సాగిస్తోందని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.

మాటకు కట్టుబడిన ప్రభుత్వం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి

ఎస్సీ, బీసీలకు సబ్సిడీతో సూర్యఘర్‌ పథకం అమలు

పైలెట్‌ ప్రాజెక్టుగా హెచ.కైరవాడి గ్రామం ఎంపిక

బనవాసిలో 220 కేవీ విద్యుత సబ్‌స్టేషన ఏర్పాటు

ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి

ఎమ్మిగనూరు, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత చార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచకుండా పాలన సాగిస్తోందని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. బుధవారం విద్యుత శాఖ ఎస్‌ఈ ఉమాపతి, ఎమ్మిగనూరు విద్యుత శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం తొమ్మిది సార్లు విద్యుత చార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలపై ఎనలేని భారం మోపిందని విమర్శించారు. అయితే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత చార్జీలను ఏమాత్రం పెంచలేదన్నారు. ప్రస్తుతం చంద్రబాబు విద్యుత రంగంపై ప్రత్యేక చొరవ తీసుకున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డబల్‌ ఇంజన సర్కార్‌లో పీఎం సూర్యఘర్‌ పథకాన్ని ఎస్సీలకు ఉచితం గాను, బీసీలకు సబ్సిడీపై అందజేసేందుకు చర్యలు తీసకుందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పీఎం సూర్యఘర్‌ పథకం కోసం 11,252 మంది రిజిసే్ట్రషన చేసుకున్నారన్నారు. బీసీలకు ప్రస్తుతం ఇచ్చే సబ్సిడీని మరింత పెంచేందుకు సీఎం ఆలోచిస్తున్నారన్నారు. గోనెగండ్ల మండ లంలో ఉన్న హెచ. కైరవాడి గ్రామాన్ని పైలెట్‌ ప్రాజెక్టుకు ఎంపిక చేశామన్నారు. ఈ పథకం పూర్తిస్థాయిలో అమలు జరిగితే విద్యుత బిల్లుల భారం తగ్గడమేకాకుండా విద్యుతను ప్రభుత్వానికి అమ్మేస్థాయికి చేరుకుంటామన్నారు. ఇక వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుతను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అలాగే బనవాసిలో 220 కేవీ సబ్‌స్టేషన ఏర్పాటుకు టెండర్లకు పిలిచామన్నారు. ఈ సబ్‌స్టేషన పూర్తయితే ఎమ్మిగనూరు ప్రాంతంలో అటురైతులు, ఇటు ప్రజలకు నాణ్యమైన విద్యుత సరఫరా అవుతుందన్నారు. గ్రామాల్లో ఖాళీ స్థలాల్లో కూడా సౌర విద్యుతప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుం టున్నామన్నారు. సమావేశంలో ఎమ్మిగనూరు డీఈ విజయరాజు, ఏడీఈ నాగేంద్రప్రసాద్‌, ఏఈలు ప్రసన్న ఆంజనేయులు, గురుమూర్తి, సుధాకర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ గంగిరెడ్డి పాల్గొన్నారు. అంతకు ముందు 17వ వార్డులో పర్యటించారు. స్థానిక సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Updated Date - Apr 03 , 2025 | 12:41 AM