Share News

సబ్‌ రిజిస్ర్టార్‌పై చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Mar 18 , 2025 | 12:47 AM

ఎమ్మిగనూరు గత సబ్‌ రిజిస్ర్టార్‌ రాందాస్‌పై చర్యలు తీసుకోవాలని ఎమ్మిగనూరు పట్టణా నికి చెందిన నీలావతి, శ్రీరామ్‌ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌ రంజిత బాషాకు ఫిర్యాదు చేశారు.

సబ్‌ రిజిస్ర్టార్‌పై చర్యలు తీసుకోవాలి
ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌

కర్నూలు కలెక్టరేట్‌, మార్చి 17(ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు గత సబ్‌ రిజిస్ర్టార్‌ రాందాస్‌పై చర్యలు తీసుకోవాలని ఎమ్మిగనూరు పట్టణా నికి చెందిన నీలావతి, శ్రీరామ్‌ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌ రంజిత బాషాకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రాలయం గ్రామ పరిధిలోని సర్వే నెంబరు 135/2 ప్లాట్‌ నెంబరు.68ను 2017లో ఒకరికి, 2023లో మరొకరికి తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో సబ్‌ రిజిస్ర్టార్‌ రాందాసు రిజిస్ర్టేషన చేశారని ఆరోపించారు. చెల్లని ధ్రువపత్రాలతో రిజిస్ర్టేషన చేసిన రిజిస్ర్టార్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలన్నారు. ఆయనపై రిజిస్ర్టేషన అండ్‌ స్టాంప్స్‌ డిప్యూటీ ఇనస్పెక్టర్‌ జనరల్‌కు కూడా ఫిర్యాదు చేశామని వారు పేర్కొన్నారు. ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, హోళగుంద ప్రాంతాల్లో గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేయాలని ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరుకుల రాజు, జాతీయ లంబాడీ సంఘం రాష్ట్ర సమన్వయకర్త ఆర్‌ యోగేష్‌ నాయక్‌ కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాం తాల్లో పదివేల మంది గిరిజనులు నివసిస్తున్నారు. ఆర్థికంగా వెనుకబ డటంతో వారు బళ్లారి, గుంటూరు, హైదరాబాదు, ముంబై, కలకత్తా దూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. కాబట్టి వారి చదువులకు ఆటంకం కలగకుండా ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. జర్నలిస్టులకు ఉచిత మెడికల్‌ క్యాంపు నిర్వహించాలని విలేకరులు మీసాల రామస్వామి, కందనవోలు శ్రీను, హరికృష్ణ, రమేష్‌ కలెక్టర్‌ను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫ్రింట్‌, ఎలక్రా ్టనిక్‌ మీడియాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు అనారోగ్యంతో మృతి చెందు తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్‌ జర్నలిస్టులకు పెన్షన సౌకర్యం, మూడు సెంట్లు స్థలం, మృతి చెందిన కుటుంబాలకు భద్రత కల్పించా లని కోరారు. కార్యక్రమంలో సుధాకర్‌, ఆనంద్‌ పాల్గొన్నారు. ఆలూరు నియోజకవర్గం మరకట్ట గ్రామంలోని దళితవాడలో గ్రామ పంచాయతీ తీర్మాణం మేరకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని జిల్లా మాల సంఘం జాయింట్‌ యాక్షన కమిటీ సభ్యులు దామోదరం రాధాకృష్ణ, జైభీమ్‌ సాయిరాం, కసాపురం వెంకటేశ కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో చెన్నకేశవులు, మాధవస్వామి, మునయ్య, కేశవ్‌, మల్లికార్జున పాల్గొన్నారు.

Updated Date - Mar 18 , 2025 | 12:47 AM