Share News

అర్ధరాత్రి ఆటో డ్రైవర్‌ వీరంగం

ABN , Publish Date - Mar 26 , 2025 | 11:58 PM

అర్ధరాత్రి ఓ ఆటో డ్రైవర్‌ వీరంగం సృష్టించాడు. మంగళవారం అర్ధరాత్రి డయల్‌ 100కు ఫోన్‌ వచ్చింది. దీంతో డయల్‌ 100 సిబ్బంది కర్నూలు పోలీసులను అప్రమత్తం చేశారు. రాత్రి డ్యూటీలో ఉన్న డీఎస్పీ బాబుప్రసాద్‌ సమాచారం అందుకున్న వెంటనే అన్ని చెక్‌పోస్టులను అప్రమ్తతం చేశారు.

అర్ధరాత్రి ఆటో డ్రైవర్‌ వీరంగం
లోయలో పడిన ఆటోను క్రేన్‌తో తీస్తున్న పోలీసులు, ఇన్‌సెట్‌లో ఆటో డ్రైవర్‌ మనోజ్‌

ఆటోను లోయలో తోసి ఎత్తుకెళ్లారంటూ డయల్‌ 100కు కాల్‌

అప్రమత్తమైన పోలీసులు

ఆటో డ్రైవర్‌ నిర్వాకం గుర్తించి మందలింపు

కర్నూలు క్రైం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): అర్ధరాత్రి ఓ ఆటో డ్రైవర్‌ వీరంగం సృష్టించాడు. మంగళవారం అర్ధరాత్రి డయల్‌ 100కు ఫోన్‌ వచ్చింది. దీంతో డయల్‌ 100 సిబ్బంది కర్నూలు పోలీసులను అప్రమత్తం చేశారు. రాత్రి డ్యూటీలో ఉన్న డీఎస్పీ బాబుప్రసాద్‌ సమాచారం అందుకున్న వెంటనే అన్ని చెక్‌పోస్టులను అప్రమ్తతం చేశారు. ఆటో డ్రైవర్‌ నెంబరు ఆధారంగా ఫోన్‌ చేసి సమాచారం తీసుకున్నాడు. నంద్యాల చెక్‌పోస్టు, టోల్‌గేటు, గుత్తి పెట్రోల్‌ బంకు, రింగ్‌ రోడ్డు తదితర ప్రాంతాల్లో గాలించారు. ఓర్వకల్లు వరకు వెళ్లి పరిశీలించారు. టోల్‌గేట్‌ దగ్గరకు వెళ్లి సీసీ కెమెరాలు పరిశీలిస్తే నిందితుడు చెప్పిన ఆటో అటు వైపు రాలేదని గుర్తించారు. కాల్వబుగ్గ దగ్గరకు వెళ్లి సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. ఓ ఆటో లోయలో పడినట్లుగా గమనించారు. తీరా విచారిస్తే ఇదంతా ఆటో డ్రైవర్‌ నిర్వాకమే అని తెలుసుకున్నారు. ఆటో డ్రైవర్‌ నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యక్తి మనోజ్‌గా పోలీసులు గుర్తించారు. మనోజ్‌ జమ్మలమడుగు చెందిన మహిళతో వివాహమైంది. భార్య గొడవ పడి జమ్మలమడుగుకు పుట్టింటికి వెళ్లింది. ఆటో డ్రైవర్‌ తన భార్య కొసం నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి వారం రోజులుగా ఆటో నడుపుకుంటూ జమ్మలమడుగుకు బయలుదేరాడు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో నంద్యాల నుంచి రాత్రి 11 గంటలకు బయలుదేరి కర్నూలు వచ్చే సమయంలో ఓర్వకల్లు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కాల్వబుగ్గ వద్ద లోయలో ఆటో పడి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయలపాలైన ఆటో డ్రైవర్‌ విచారిస్తే మద్యం తాగిన మత్తులో తాను ఏమీ మాట్లాడానో తెలియడం లేదని, బ్రెయిన్‌ సరిగా పని చేయలేదని గాయాలతో పోలీసులకు తెలిపాడు. ప్రమాదం జరిగిన వెంటనే కాల్వబుగ్గ నుంచి హుశేనాపురం మధ్యలో ఉన్న నయారా పెట్రోల్‌ బంకు వద్దకు వచ్చి పోలీసులకు పోన్‌ చేశానని చెప్పాడు. అనంతరం ఆటోడ్రైవర్‌ను పోలీసులు మందలించి కౌన్సెలింగ్‌ చేసి పంపించారు. లోయలో పడిన ఆటోను క్రేన్‌ సాయంతో తీయించారు.

Updated Date - Mar 26 , 2025 | 11:58 PM