మంత్రాలయంలో భక్తుల సందడి
ABN , Publish Date - Mar 30 , 2025 | 12:23 AM
ప్రముఖపుణ్యక్షేత్ర మైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ధర్శనార్థం వచ్చిన భక్తులతో సందడిగా మారింది.

మంత్రాలయం, మార్చి 29(ఆంధ్రజ్యోతి): ప్రముఖపుణ్యక్షేత్ర మైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ధర్శనార్థం వచ్చిన భక్తులతో సందడిగా మారింది. శనివారం అమావాస్య ఆదివారం ఉగాది, సోమవారం రంజాన పండుగల సెలవులు రావడంతో దక్షణాది రాష్ర్టాలైన ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో మఠం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను చెక్క రథంపై శనివారం భక్తులకు దర్శనం ఇచ్చారు. అనంతరం స్వామివారికి ఊంజల సేవ నిర్వహించారు. రాఘవేంద్రస్వామి మఠంలో అమావాస్యను పురస్కరించుకొని మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు మూల బృందావనానికి పూజలు నిర్వహించారు. రాఘవేంద్రస్వామి బృందావన ప్రతిమను స్వర్ణపల్లకిలో అధిష్టించి ఊరేగించారు.