ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేయాలి
ABN , Publish Date - Mar 30 , 2025 | 12:27 AM
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.

ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం
కల్లూరు, మార్చి 29(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. శనివారం కల్లూరు అర్బన 19, 20వ వార్డులలో నిర్వహించిన టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవానికి ఆమె ముఖ్య అతిఽథి హాజరై జెండా ను ఆవిష్కరించి, ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పిం చారు. కర్నూలు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన పెరుగు పురుషోత్తంరెడ్డి, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌యాదవ్ ఆధ్వర్యంలో గౌరు చరిత కేక్ కట్ చేయగా, పార్టీశ్రేణులు మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకు న్నారు. కార్యక్రమంలో బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, నాగముని, జనార్ధన రెడ్డి నాయకులు పాల్గొన్నారు.
కర్నూలు రూరల్: తెలుగుదేశంపార్టీ వ్యవ స్థాపకుడు ఎన్టీఆర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కర్నూలు మండలం సూదిరెడ్డిపల్లె గ్రామంలో శనివారం ఎమ్మెల్యే దస్తగిరి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు వెంకట్రాముడు, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు పాల్గొన్నారు.
కర్నూలు అర్బన: నగరంలోని 8వ వార్డు కార్పొరేటర్ కురవ పరమేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కురవ పరమేష్ మాట్లాడుతూ పార్టీ అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ సద్విని యోగం చేసుకోవాలని కోరారు. టీఎనటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ ఆఽధ్వర్యంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పి.ప్రభా కర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవారాజు, భరత పాల్గొన్నారు.
గూడూరు: గూడూరులో టీడీపీ అవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి హాజరై టీడీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కోసం టీడీపీ ఆవిర్భవించిందన్నారు. కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన కె రామాంజనేయులు, టీడీపీ నాయకులు సృజన, రేమట వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ రేమట సురేష్, పౌలు, నాగప్ప యాదవ్, డాక్టర్ మన్ననబాషా, మన్సుర్ బాషా, చాంద్‌బాషా, కోడుమూరు షాషావలి, విజయ్‌కుమార్, పి.రామాంజనేయులు, రహిమాన పాల్గొన్నారు.
కోడుమూరు రూరల్: మండలంలోని అమడగుంట్లలో సర్పంచ వరలక్ష్మీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. వెంకటగిరిలో జెండా ఆవిష్కరించిన అనంతరం ఉచిత వైద్యశిబిరం ప్రారంభించారు. వర్కూర్ ఎస్సీ కాలనీలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో వెంకటగిరి ఎంపీటీసీ సుజాత, యువనాయకుడు రాజు, నారాయణ, చంద్ర అమడగుంట్ల రమేష్, సురేష్, శ్రీనివాసరెడ్డి వర్కూరు రామాంజనేయులు పాల్గొన్నారు.
ఓర్వకల్లు: మండలంలో పలు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఓర్వకల్లు రచ్చకట్ట వద్ద పార్టీ మండల కన్వీనర్ గోవిందరెడ్డి, నాయకులు రాంభూపాల్‌రెడ్డి, లక్ష్మీ కాంతరెడ్డి, హుస్సేనాపురంలో టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్ సతీమణి, మాజీ సర్పంచు మల్లెల జ్యోతి, గుట్టపాడులో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు, గ్రామ సర్పంచు నర్ల మోహనరెడ్డి, పాలకొలనులో సర్పం చు చదువుల సుజాతమ్మ, టీడీపీ సీనియర్ నాయకులు సుధాకర్‌రెడ్డి, నన్నూరులో టీడీపీ సీనియర్ నాయకులు విశ్వేశ్వరరెడ్డి, కన్నమడకలలో నాయకులు సుధాకర్‌రావు, లొద్దిపల్లెలో పరమేశ్వరరెడ్డి లు పార్టీ పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి ఎన్టీఆర్ చిత్రపటాలకు నివాళులర్పించారు. కార్యక్ర మంలో నాయకులు ఉప సర్పంచు షమినాబీ, భాస్కర్‌రెడ్డి, శ్రీరామ్‌రెడ్డి, జీకె.సుధాకర్, కెవి.మధు, శేకరప్ప, నాగరాజు, అన్వర్ బాషా, బజారు, అల్లబాబు, కాకి దేవేంద్ర, ఆకుల మహేష్, నాగమ ల్లేష్, బత్తుల రమణ పాల్గొన్నారు.