Share News

కొండంత పండుగ శ్రీవిశ్వావసు ఉగాది

ABN , Publish Date - Mar 29 , 2025 | 11:49 PM

రుచుల పండుగ ఉగాది. జీవితంలో అన్ని అనుభవాలను, ఉద్వేగాలను, ఆనంద విషాదాలను సమంగా స్వీకరించాలని, కలిపి ఆస్వాదించాలని చాటే పండుగ తెలుగు సంవత్సరాది. ఉగాది పచ్చడిలోని అర్ధం అదే. షడ్రుచులు కలిసే ఉగాది పచ్చడిని ఆస్వాదించడం సంప్రదాయం. తెలుగు పంచాంగం ప్రకారం ఆదివారం శ్రీవిశ్వావసు నామ సంవత్సరం ఆరంభం కాబోతుంది

కొండంత పండుగ శ్రీవిశ్వావసు ఉగాది
నంద్యాలలో ముస్తాబైన సంజీవనగర్‌ రామాలయం

ముస్తాబైన ఆలయాలు

పంచాంగ పఠనానికి ప్రత్యేక ఏర్పాట్లు

నేడు ఉగాది పర్వదినం

నంద్యాల కల్చరల్‌, మార్చి 29(ఆంధ్రజ్యోతి): రుచుల పండుగ ఉగాది. జీవితంలో అన్ని అనుభవాలను, ఉద్వేగాలను, ఆనంద విషాదాలను సమంగా స్వీకరించాలని, కలిపి ఆస్వాదించాలని చాటే పండుగ తెలుగు సంవత్సరాది. ఉగాది పచ్చడిలోని అర్ధం అదే. షడ్రుచులు కలిసే ఉగాది పచ్చడిని ఆస్వాదించడం సంప్రదాయం. తెలుగు పంచాంగం ప్రకారం ఆదివారం శ్రీవిశ్వావసు నామ సంవత్సరం ఆరంభం కాబోతుంది. ఈ సందర్భంగా ఆలయాల్లో పంచాంగ పఠనానికి ఏర్పాట్లు చేశారు. నంద్యాల మార్కెట్‌లో ప్రజలు ఉగాది పచ్చడికి కావల్సిన వేప పువ్వు, బెల్లం, చెరకుగడలు, మామిడికాయలు, ఇళ్ల ముంగిట మామిడితోరణాలు,పూజలకోసం పువ్వులు, అరటిఆకులు,రంగులు చల్లుకోవడానికి రంగులు కొనుగోలుచేయడంలో నిమగ్నమయ్యారు. నూతన వస్త్రాలు కొనుగోలు చేశారు.

Updated Date - Mar 29 , 2025 | 11:49 PM