పోక్సో చట్టంపై అవగాహన పెంచుకోవాలి
ABN , Publish Date - Mar 21 , 2025 | 12:59 AM
పోక్సో చట్టంపై అవగాహన పెంచుకోవాలని కర్నూలు ఎక్సైజ్ కోర్టు న్యాయాధికారి జి.సరోజనమ్మ విద్యార్థులకు సూచించారు.

కర్నూలు లీగల్, మార్చి 20(ఆంధ్రజ్యోతి): పోక్సో చట్టంపై అవగాహన పెంచుకోవాలని కర్నూలు ఎక్సైజ్ కోర్టు న్యాయాధికారి జి.సరోజనమ్మ విద్యార్థులకు సూచించారు. స్థానిక పసుపుల గ్రామంలోని ప్రభుత్వ ఉన్న త పాఠశాలలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. పోక్సో చట్టం ప్రకారం పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని, 18ఏళ్ల లోపు వయసు గల పిల్లల పై వేధింపులకు పాల్పడకుండా ఈ చట్టం ఉపయోగపడుతుందని తెలి పారు. కార్యక్రమంలో తాలుకా ఎస్‌ఐ చంద్రశేఖర్ రెడ్డి, హెడ్ మాస్టర్ విజయమ్మ, అధ్యా పకులు, విద్యార్థులు పాల్గొన్నారు.