మంత్రాలయంలో భక్తుల రద్దీ
ABN , Publish Date - Mar 21 , 2025 | 12:55 AM
రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం కిక్కిరిసింది.

మంత్రాలయం, మార్చి 20(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం కిక్కిరిసింది. గురువారం రాఘవేంద్ర స్వామికి ఇష్టమైన దినం కావటంతో దక్షిణాది రాష్ర్టాల నుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో మఠం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, ప్రధాన రహదారులు, మధ్వమార్గ్ కారిడార్, రాఘవేంద్ర సర్కిల్, నదితీరం భక్తులతో కోలాహాలంగా మారింది. గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవాల ఊరేగింపులో పాల్గొని భక్తులు మఠం పీఠాధిపతి ఆశీస్సులు పొందారు.
వైభవంగా నవరత్నాల రథోత్సవం: రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులు నవరత్నాల రథంపై విహరించారు. మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో రాఘవ్రేంద్రస్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠాఽఽధిపతి పూర్ణ భోధ పూజ మందిరంలో మూలరాములకు బంగారు నాణేలతో అభిషేకం చేసి హారతులు ఇచ్చారు. వేద పండితుల మంత్రోచ్ఛారణాలు, మంగళ వాయిద్యాల మధ్య నవరత్నాల రథంపై ఊరేగించారు.