ఐదు గ్రేడ్లతో అనర్థం
ABN , Publish Date - Mar 26 , 2025 | 11:55 PM
ఏ ప్రభుత్వ శాఖలో లేని విధంగా ఐదు గ్రేడ్లు పంచాయతీ శాఖలో ఉన్నాయి. మిగతా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల్లో కేవలం రెండు గ్రేడ్లు మాత్రమే ఉంటాయి. అందువల్ల దాదాపు అయిదారేళ్ల వ్యవధిలో పదోన్నతులు లభిస్తాయి. దీనికి పూర్తి భిన్నంగా పంచాయతీ కార్యదర్శుల వ్యవస్థ ఉంది.

ఏ ప్రభుత్వ శాఖలో లేనన్ని పంచాయతీశాఖలో..
20 ఏళ్లు పని చేసినా పదోన్నతులు లేక పదవి విరమణ
రెండు గ్రేడ్లుగా చేయాలని పంచాయతీ కార్యదర్శుల విజ్ఞప్తి
కర్నూలు కలెక్టరేట్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ఏ ప్రభుత్వ శాఖలో లేని విధంగా ఐదు గ్రేడ్లు పంచాయతీ శాఖలో ఉన్నాయి. మిగతా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల్లో కేవలం రెండు గ్రేడ్లు మాత్రమే ఉంటాయి. అందువల్ల దాదాపు అయిదారేళ్ల వ్యవధిలో పదోన్నతులు లభిస్తాయి. దీనికి పూర్తి భిన్నంగా పంచాయతీ కార్యదర్శుల వ్యవస్థ ఉంది.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 982 గ్రామ పంచా యతీలు ఉన్నాయి. దాదాపు 890 మంది పంచా యతీ కార్యదర్శులు ఐదు గ్రేడ్లుగా పని చేస్తున్నా రు. వీరిలో గ్రేడ్ 1, 2 పంచాయతీ కార్యదర్శుల పదోన్నతి ప్రక్రియ రాష్ట్ర స్థాయిలో కమిషనరేట్ కార్యాలయం పర్యవేక్షిస్తుంది. ఇక గ్రేడ్ 3, 4, 5 పంచాయతీ కార్యదర్శుల పదోన్నతులను జిల్లా గ్రామ పంచాయతీ అధికారి కార్యాలయం నిర్దేశిస్తుంది. ఈ అధిక గ్రేడ్ల కారణంగా దాదాపు 20 ఏళ్లు పని చేసినప్పటికీ పదోన్నతికి నోచుకో కుండానే పంచాయతీ కార్యదర్శులు పదవి విరమణ చేసిన ఉదంతాలు ఉన్నాయి.
రెండు గ్రేడ్లుగా చేయాలి..
గ్రేడ్ 1, 2 విలీనం చేసి గ్రేడ్ 1 పంచాయతీ కార్యదర్శిగా, గ్రేడ్ 3, 4, 5 కలిపి గ్రేడ్ 2గా చేయా లని పలువురు పంచా యతీ కార్యదర్శులు కోరు తున్నారు. బిల్ కలెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లు తమ పదోన్నతుల్లో వాటా పొందడం వల్ల సింహభాగం పదోన్న తులు వారికే దక్కుతు న్నాయి. తమకు కూడా మినిస్టీరియల్ శాఖల్లో ఖాళీగా ఉన్న జూని యర్ అసిస్టెంట్లు, సీని యర్ అసిస్టెంట్లు పదోన్నతుల్లో వాటా కల్పించాలని ప్రభు త్వాన్ని కోరుతున్నారు. ఇక మండల స్థాయిలో ఉపాధి హామీ, డీఆర్‌డీఏ విభాగాల్లో మండల స్థాయి ఉద్యో గులు కూడా అవుట్ సోర్సింగ్ వారే పని చేస్తున్నారు. కనుక అక్కడ పంచాయతీ కార్యదర్శు లకు పదోన్నతులు కల్పించి స్థానాలు కేటాయించి న్యాయం చేయాలని కోరుతున్నారు.
అటకెక్కిన జీవో.నెం.2
గతంలో జీవో.నెం.2 ప్రకారం సచివాలయం అధిపతిగా ఉండే పంచాయతీ కార్యదర్శులను తప్పించి వీఆర్వోలకు పట్టం కట్టారు. తమ జీతభత్యాలు తామే పొందే విధంగా పంచాయతీ కార్యదర్శులను సెల్ఫ్ డీడీవోలుగా ప్రకటించారు. అయితే అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా ఆ జీవో అటకెక్కింది. ప్రస్తుతం పంచాయతీ కార్యద ర్శులు సచివాలయానికి డీడీవోగా వ్యవహరిస్తు న్నారు. విపరీతమైన సర్వేల భారం వారిపై పడుతోంది. పైగా సచివాలయ సిబ్బంది ఎవరికి వారికి వారి మాతృ శాఖలు సర్వే నుంచి మినహా యింపునిచ్చాయి. దీంతో సర్వేలు పూర్తికాక పంచా యతీ కార్యదర్శులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.
ఇక గ్రామ పంచాయతీకి సంబంధించి ఇంటి, కొళాయి పన్నుల వసూలు, గ్రామ సభలు, గ్రామ పంచాయతీ సమావేశాలు, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, మోటారు రిపేర్లు, జనన, మరణ వివాహ ధృవీకరణ పత్రాల పనుల్లో తలమునకలై ఉన్నారు. సర్వే పనులను ఎంపీడీవో పర్యవేక్షిస్తుండగా.. గ్రామ పంచాయతీ పనులపై ఈవోఆర్‌డీ ఆజమా యిషీ చేస్తున్నారు. ఈ పని తమ వల్ల కాదంటూ మండల కార్యాలయాల్లో వినతి పత్రాలు సమర్పిస ్తున్నారు. దీంతో పంచాయతీ కార్యదర్శి పని అడకతెరలో పోక చెక్కలా తయారైంది. సచివాల యం నుంచి పంచాయతీకి లంకె తెంపేస్తేనే తమకు విముక్తి కలుగుతుందని పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
త్వరగా 1, 2 గ్రేడ్‌గా మార్చాలి
కమిషనరేట్‌లో త్వరిత గతిన గ్రేడ్ 1, 2 వారి పదోన్న తులు పూర్తయితే చాలా మంచిది. దిగువనున్న గ్రేడ్ 3, 4, 5 వారి పదోన్నతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. - గిరి శ్రీకాంత్, కన్వీనర్, నవీన పంచాయతీ కార్యదర్శుల సంఘం
సచివాలయంతో లంకె తెంపేయాలి
సచివాలయంలో పంచా యతీ కార్యదర్శుల లంకెను తెంపేస్తేనే గ్రామ పంచా యతీలు మనుగడ సాగి స్తాయి. సచివాలయం పని భారం వల్ల కార్యదర్శులు తీవ్ర ఒత్తిడికి లోనవుతు న్నారు. - నరేష్, పంచాయతీ కార్యదర్శి, గోవర్ధనగిరి