Share News

తాగునీటి సమస్య లేకుండా చూడాలి

ABN , Publish Date - Mar 20 , 2025 | 11:49 PM

మండలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్య్టూఎస్‌ ఈఈ పద్మజ, ఆలూరు డీఈ మల్లికార్జున య్య సూచించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు.

తాగునీటి సమస్య లేకుండా చూడాలి
సర్పంచులతో మాట్లాడుతున్న ఆర్‌డబ్య్టూఎస్‌ ఈఈ పద్మజ

హొళగుంద, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): మండలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్య్టూఎస్‌ ఈఈ పద్మజ, ఆలూరు డీఈ మల్లికార్జున య్య సూచించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో నీటి ఎద్దడిపై సర్పంచులు, పంచాయతీ కార్యద ర్శులను అడిగి తెలుసుకున్నారు. చిన్నహ్యాట, ఎల్లార్తి గ్రామాలకు నూతన పైప్‌లైన్‌ వేయడంతో పాటు, నేరణికి గ్రామం లో ఆర్‌వో ప్లాంటు, గజ్జెహల్లి గ్రామానికి కడ్లమాగి సీపీడ బ్లూ స్కీమ్‌ నుంచి నీటి సరఫరా, కోగిలతోట గ్రామానికి ఓవర్‌ హెడ్‌ క్‌ ఏర్పాటయ్యే లా జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళా ్తమన్నారు. ఎంపీడీవో విజయ లలితా, ఏఈలు రాంనీలా, వెంకటరమణి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - Mar 20 , 2025 | 11:49 PM