Share News

Bhimili Beach: పురాతన నిర్మాణాలు కాదు... నేహారెడ్డి నిర్మించిన పునాదులు

ABN , Publish Date - Mar 22 , 2025 | 04:36 AM

రెండేళ్ల క్రితం వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అనుమతులూ లేకుండానే బీచ్‌లో స్టార్‌ హోటల్‌ నిర్మాణానికి పునాదులు తీశారు. భారీ కాంక్రీట్‌ నిర్మాణాలు చేపట్టారు. ఈ ప్రాంతం కోస్తా నియంత్రణ మండలి పరిధిలో ఉంది. వాటిపై పలువురు హైకోర్టుకు వెళ్లారు.

Bhimili Beach: పురాతన నిర్మాణాలు కాదు... నేహారెడ్డి నిర్మించిన పునాదులు

ది పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడ్డ నిర్మాణం కాదు... భీమిలి బీచ్‌లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి కంపెనీ చేపట్టిన నిర్మాణాలు. రెండేళ్ల క్రితం వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అనుమతులూ లేకుండానే బీచ్‌లో స్టార్‌ హోటల్‌ నిర్మాణానికి పునాదులు తీశారు. భారీ కాంక్రీట్‌ నిర్మాణాలు చేపట్టారు. ఈ ప్రాంతం కోస్తా నియంత్రణ మండలి పరిధిలో ఉంది. వాటిపై పలువురు హైకోర్టుకు వెళ్లారు. ఆ నిర్మాణాలను పూర్తిగా తొలగించి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. మేల్కొన్న అధికారులు బీచ్‌లో పునాదులను తవ్వి తీస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి బయల్పడ్డ నిర్మాణమే ఇది. చతురస్రాకారంలో ఉన్న నిర్మాణాల్లో ఒకటి 10 అడుగుల ఎత్తు ఉండగా, మరొకటి 12 అడుగులు ఉంది. ప్రహరీ కోసం నిర్మించిన పునాదులు 700 మీటర్లు, 1,000 మీటర్ల పొడవున ఉన్నాయి. హైకోర్టుకు నివేదిక ఇవ్వాల్సిన సమయం దగ్గరపడడంతో అధికారులు పనుల్లో వేగాన్ని పెంచారు. - విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి


ఇవి కూడా చదవండి:

Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు

Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా

MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే

Updated Date - Mar 22 , 2025 | 04:36 AM