Share News

‘రైతులు సమన్వయంతో నీటిని వాడుకోవాలి’

ABN , Publish Date - Mar 26 , 2025 | 12:48 AM

కర్నూలు, కడప కాలువ కింద రైతులు ఎలాంటి గొడవలు లేకుండా నీటిని సమన్వయంతో వాడుకోవాలని కేసీ ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌ రామలింగారెడ్డి సూచించారు.

‘రైతులు సమన్వయంతో నీటిని వాడుకోవాలి’
ఈర్నపాడు వద్ద రైతులతో మాట్లాడుతున్న రామలింగారెడ్డి

బండిఆత్మకూరు, మార్చి 25(ఆంధ్రజ్యోతి): కర్నూలు, కడప కాలువ కింద రైతులు ఎలాంటి గొడవలు లేకుండా నీటిని సమన్వయంతో వాడుకోవాలని కేసీ ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌ రామలింగారెడ్డి సూచించారు. మంగళవారం ఆయన డీఈ రవికుమార్‌, ఏఈ మునాఫ్‌లతో కలిసి నంద్యాల నుంచి ఈర్నపాడు, బండిఆత్మకూరు, సంతజూటూరు పికప్‌ అనకట్టల వద్ద కెసీ కెనాల్‌ను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సంతజూటూరు పికప్‌ అనకట్ట నుంచి 600 క్యూసెక్కుల నీరు కేసీకి విడుదల జరరుగుతోందని కెనాల్‌లో అడ్డంగా కట్టలు వేయకూడదని, చివరి ఆయకట్టు వరకు రైతులకు నీరు అందేందుకు సహకరించాలని సూచించారు.

Updated Date - Mar 26 , 2025 | 12:48 AM