Share News

మహానంది షాపుల వేలాల్లో రగడ

ABN , Publish Date - Mar 29 , 2025 | 11:23 PM

మహానంది క్షేత్రంలో ఏడాది పాటు కొబ్బరి చిప్పలు పోగు చేసుకోవడం, మరుగుదొడ్ల నిర్వహణ వేలంలో రూ.27.50 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు. అలాగే ఆలయ పరిసరాల్లోని షాపులతో పాటు ఖాళీ స్ధలాలకు మూడు సంవత్సరాల కాల పరిమితి కింద శనివారం బహిరంగ వేలాలను స్ధానిక పోచా విశ్రాంతి భవనంలో నిర్వహించారు.

మహానంది షాపుల వేలాల్లో రగడ
ఘర్షణ పడుతున్న ఇరు పార్టీల మద్దతుదారులు

మహానంది, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రంలో ఏడాది పాటు కొబ్బరి చిప్పలు పోగు చేసుకోవడం, మరుగుదొడ్ల నిర్వహణ వేలంలో రూ.27.50 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు. అలాగే ఆలయ పరిసరాల్లోని షాపులతో పాటు ఖాళీ స్ధలాలకు మూడు సంవత్సరాల కాల పరిమితి కింద శనివారం బహిరంగ వేలాలను స్ధానిక పోచా విశ్రాంతి భవనంలో నిర్వహించారు. ఉదయం నిర్వహించిన బహిరంగ వేలాల్లో భక్తుల కొబ్బరి చిప్పలు ఏడాది పాటు పోగు చేసుకొనే హక్కును మహానందికి చెందిన రాజ లింగేశ్వరయ్య రూ. 18, 9, 999 సీల్‌ టెండర్‌ ద్వారా దక్కించుకున్నారని ఈవో చెప్పారు. అలాగే బీఎ్‌సఎన్‌ ఎల్‌ కార్యాలయం పక్కన ఉన్న మరుగుదొడ్ల నిర్వహణను సి. మహేశ్వరయ్య రూ.9,40,000 దక్కించుకొన్నట్లు ఈవో తెలిపారు. అయితే ఆలయ పరిసరాల్లోని షాపులకు నిర్వహించిన బహిరంగ వేలాల్లో చాలా మంది వ్యాపారులు ధరావత్తు చెల్లించి పోటీలో పాల్గొనడంతో పోటీ పెరిగింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత మధ్య షాపులకు వేలాలు జరిగాయి. ఏఈవో యర్రమల్ల మధు పర్యవేక్షకుడు శశిధర్‌రెడ్డి, సీనియర్‌ అసిస్టెంట్లు సుబ్బారెడ్డి, మల్లికార్జునయ్య, నీలకంఠరాజు, నాగమల్లయ్య పాల్గొన్నారు.

ఏడుగురిపై కేసు నమోదు

బహిరంగ వేలాల్లో ఘర్షణకు పాల్పడ్డ ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి శనివారం రాత్రి తెలిపారు. బహిరంగ వేలాల్లో అల్లర్లకు పాల్పడి వేలం పాటలో పాల్గొన్న భవనాశి రమణయ్యపై దాడి చేసిన మహానందికి చెందిన సుబ్బరామయ్యతో పాటు అతని సోదరులు ముగ్గురు. మరో ముగ్గురు వ్యక్తులపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్తాపు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.

టీడీపీ మద్దతుదారులపై వైసీపీ నాయకులు దాడి హేయమైన చర్య

సామరస్యంగా మహానందిలో జరుగుతున్న షాపుల బహిరంగ వేలాల్లో వైసీపీ నాయకులు బహిరంగ వేలాల్లో పాల్గొన్న టీడీపీ మద్దతుదారులపై దాడి చెయ్యడం హేయమైన చర్య అని కేసీ కెనాల్‌ అధ్యక్షుడు బన్నూరి రామలింగారెడ్డి అన్నారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేసారు.

Updated Date - Mar 29 , 2025 | 11:23 PM