డిమాండ్లను నెరవేర్చాలి
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:25 AM
వివిధ ఇన్సూరెన్సు సంస్థలలో పని చేస్తున్న ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చకుంటే ఈ నెల 27 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు హైదరాబాదు ప్రాంతీయ బీమా ఉద్యోగుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జంధ్యాల రఘుబాబు తెలిపారు.

మధ్యాహ్న భోజన సమయంలో ఉద్యోగుల నిరసన
కర్నూలు న్యూసిటీ, మార్చి 25(ఆంధ్రజ్యోతి): వివిధ ఇన్సూరెన్సు సంస్థలలో పని చేస్తున్న ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చకుంటే ఈ నెల 27 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు హైదరాబాదు ప్రాంతీయ బీమా ఉద్యోగుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జంధ్యాల రఘుబాబు తెలిపారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం యు నైటెడ్ ఇండియా ఇన్సూరెన్సు కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన సమయంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జంధ్యాల రఘుబాబు మాట్లాడుతూ నేషనల్ ఇన్సూరెన్సు, న్యూ ఇండియా, ఓరియంటల్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్సు కంపెనీలలోని ఉద్యోగులు, అధికారుల వేతన సవరణ ఆగస్టు నుంచి పరిష్కరించకుండా కాలయాపన చేయడం తగదన్నారు. ఫ్యామిలీ పెన్షన 30 శాతం పెంచాలన్నారు. కార్యక్రమంలో నాయకులు నాగరాజు, శివకుమార్, జయశ్రీ, కృష్ణ, అస్లాం బాషా, రంగనాథ్, మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు.