కనీస సౌకర్యాలు కరువు
ABN , Publish Date - Mar 26 , 2025 | 11:49 PM
మండలంలో 11 గ్రామాలుండగా, 11,500 జాబ్‌కార్డులు ఉన్నాయి. ప్రతి రోజూ 6వేల నుంచి 8వేల మంది వరకు కూలీలు ఉపాధి పనులకు వెళ్తున్నారు. అయితే కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు పత్తాలేరని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టార్పాలిన్లు, తాగునీరు ఇవ్వని అధికారులు
ఎండలకు అల్లాడుతున్న ఉపాధి కూలీల
మద్దికెర, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): మండలంలో 11 గ్రామాలుండగా, 11,500 జాబ్‌కార్డులు ఉన్నాయి. ప్రతి రోజూ 6వేల నుంచి 8వేల మంది వరకు కూలీలు ఉపాధి పనులకు వెళ్తున్నారు. అయితే కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు పత్తాలేరని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు ఇవ్వాల్సింది ఇవీ..
కూలీలకు తాగునీరు, మజ్జిగ, ఓఆర్‌ఆస్, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలి. కూలీలు సేద దీరేందుకు టార్పాలిన్లు ఏర్పాటు చేయాలి. ఎవరైనా అస్వస్థతకు గురైతే వారికి సమీప ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యసేవలు అందించాలి. అయితే అధికారులు ఈ సౌకర్యాలు ఏవీ కల్పిం చడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండుతున్న ఎండలు
రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. దూర ప్రాంతాల్లో పనులు ఏర్పాటు చేయడంతో నిలువ నీడ లేకుండా పోయింది. ఎవరి తాగునీరు వారే తీసుకెళ్లాల్సి వస్తోంది. మెడికల్ కిట్లు, టార్పాలిన్లు లేవు. చేసిన పనులకు వేతనాలు కూడా సరిగా ఇవ్వడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కూలీలకు సౌకర్యాలు కల్పించాలి
ఎండలు మండుతు న్నాయి. పనులకు వెళ్లాలంటే భయప డుతున్నాం. పని ప్రదేశంలో నీడలేదు. టార్పాలిన్లు అందిం చాలి. అలాగే తాగు నీరు, మెడికల్ కిట్లు ఇవ్వడం లేదు. అధి కారులు స్పందించాలి. - ఎల్లప్ప, కూలీ.
ప్రభుత్వానికి నివేదిక పంపాం
ఉపాధి కూలీల సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక పంపాం. ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే సౌకర్యాలు కల్పిస్తాం.
- నర్సిరెడ్డి, ఏపీవో