భ్రమరాంబికాదేవికి కొబ్బరికాయల సమర్పణ
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:53 AM
శ్రీశైల మహాక్షేత్రంలో చైౖత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళవారం గానీ, శుక్రవారం గానీ భ్రమరాంబ అమ్మవారికి కుంభోత్సవం జరిపించడం సంప్రదాయం.

శ్రీశైలం, మార్చి 25(ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహాక్షేత్రంలో చైౖత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళవారం గానీ, శుక్రవారం గానీ భ్రమరాంబ అమ్మవారికి కుంభోత్సవం జరిపించడం సంప్రదాయం. ఇందులో భాగంగా ఈ సంవత్సరం ఏప్రిల్ 15న కుంభోత్సవం నిర్వహించనున్నారు. అమ్మవారికి సాత్వికబలి నిర్వహించేందుకు కుంభోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో కుంభోత్సవం రోజున స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభ హారతి సమర్పించడం ప్రధాన ఘట్టం. ఈ కుంభోత్సవాన్ని పురస్కరించుకొని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే వచ్చే ప్రతి మంగళవారం గానీ, శుక్రవారం గానీ అమ్మవారికి కొబ్బరికాయలను సమర్పిస్తారు. ఇందులో భాగంగా మంగళవారం అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను రాశిగా పోసి పసుపు, కుంకుమలతో పూజాధికాలు నిర్వహించి అనంతరం అమ్మవారికి సమర్పించారు.