Share News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

ABN , Publish Date - Mar 26 , 2025 | 11:50 PM

ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. బుధవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇస్తున్న తేరుబజార్‌ వాసులు

ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే

పత్తికొండ, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. బుధవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఇప్పటికే గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామన్నారు. వేసవి దృష్టిలో ఉంచుకుని తాగునీటి ఎద్దడిరాకుండా చర్యలు తీసుకుంటు న్నామన్నారు. గ్రీవెన్స్‌లో ఇచ్చిన వినతులు, ఫిర్యాదులను త్వరలో పరిష్కరిస్తామన్నారు. టీడీపీ నాయకులు రామానాయుడు, పురుషోత్తం చౌదరి, మనోహర్‌ చౌదరి, తిమ్మయ్య చౌదరి, కడవల సుధాకర్‌, వెంకటపతి ఉన్నారు.

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

14మంది బాధితులకు సీఎం సహాయనిధి చెక్కులును ఎమ్మెల్యే పంపిణీచేశారు. నియోజకవర్గ పరిధిలో రూ.10,93,600 విలువైన చెక్కులను ఆయన పంపిణీచేశారు.

మీటింగ్‌ కట్టను పునరుద్ధరించండి

పట్టణంలోని తేరుబజార్‌లో శిదిలావస్థకు చేరిన మీటింగ్‌ కట్టను పునరుద్ధరించాలని స్థానికులు కోరారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబుకు వినతిపత్రం అందించారు. స్పందించిన ఎమ్మెల్యే సొంత నిధులతో బాగు చేయిస్తానని హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యే ఇఫ్తార్‌ విందు

రంజాన్‌ ఉపవాసాల సందర్భంగా ఎమ్మెల్యే బుధవారం రాత్రి పట్టణంలోని షాదీఖానాలో ముస్లింలకు ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. ఎమ్మెల్యే స్వయంగా ఆహారాన్ని వడ్డించారు. షాదీఖానా చైర్మన్‌ పకృద్దీన్‌, మైనార్టీ నాయకులు మీరాహుసేన్‌ ఎమ్మెల్యేను సన్మానించారుు

Updated Date - Mar 26 , 2025 | 11:50 PM