Share News

నీటి కుంటలతో సీమ సస్యశ్యామలం

ABN , Publish Date - Mar 23 , 2025 | 12:18 AM

రైతులు నీటి కుంటలు తవ్వుకుంటే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కళ్యాణ్‌ పేర్కొన్నారు. శనివారం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పుడిచెర్ల గ్రామంలో ఆయన రైతు సూర రాజన్న పొలంలో నీటి కుంట తవ్వకానికి భూమిపూజ చేశారు.

నీటి కుంటలతో సీమ సస్యశ్యామలం
డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌తో ఉపాధి కూలీలు

డిప్యూటీ సీఎం పవన్‌ కలల్యాణ్‌

హాజరైన నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత

ఓర్వకల్లు/కర్నూలు క్రైం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): రైతులు నీటి కుంటలు తవ్వుకుంటే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కళ్యాణ్‌ పేర్కొన్నారు. శనివారం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పుడిచెర్ల గ్రామంలో ఆయన రైతు సూర రాజన్న పొలంలో నీటి కుంట తవ్వకానికి భూమిపూజ చేశారు. తలకు పాగ చుట్టి.. గడ్డపార చేతపట్టి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితలతో కలసి పనుల్లో పొల్గొన్నారు. అనంతరం పవన్‌కళ్యాణ్‌ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసిందని అన్నారు. కూటమి ప్రభుత్వం పల్లె సీమల్లో ఉపాధి పనులు వేగవంతం చేసి, ప్రజల్లో అభివృద్ధిపై నమ్మకం పెంచిందని అన్నారు. ప్రకాశం బ్యారేజీ సామర్థ్యం 3 టీఎంసీలని, ప్రభుత్వం చేపట్టిన 1.55 లక్షల నీటి కుంటల తవ్వకాలు పూర్తి చేస్తే ఒక టీఎంసీ నీరు నిల్వ ఉంటుందని ఆయన అన్నారు. పంచాయతీరాజ్‌ వ్యవస్థ బలోపేతం కోసం డీఎల్‌డీవో, ఎంపీడీవో, డీపీవో, డీఎల్‌పీవో, సీఈవో, ఈవోఆర్‌డీ లాంటి కేడార్లను పునఃనిర్మాణం చేసి ప్రజలకు సమర్ధవంతంగా సేవలు అందించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు.

పల్లెపండుగలో కర్నూలు టాప్‌:

పల్లెపండుగ కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ నిధులు సద్వినియోగం చేసుకొని జిల్లాలో రూ.75 కోట్లతో 117 కిలోమీటర్లు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టి 98 శాతం పూర్తి చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని పవన్‌ కళ్యాణ్‌ కొనియాడారు. ఉపాధి కూలీల వేతన బకాయి రెండు రోజుల్లో వారి ఖాతాల్లో జమ అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్‌ పి. రంజిత్‌బాషా మాట్లాడుతూ ఉపాధి నిధులు రూ.160 కోట్లతో చేపట్టిన రోడ్లు పనులు 97 శాతం పూర్తి చేశామని, కూలీలకు ఉపాధి కల్పించి వేతనాల కోసం రూ.370 కోట్లు వెచ్చించామని తెలిపారు. ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌ సహా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. (5వ పేజీ తరువాయి)

వ్యవస్థలను వైసీపీ నిర్వీర్యం చేసింది

గత వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. ఇప్పుడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ నాయకత్వంలో తిరిగి వ్యవస్థలు గాడిలో పడుతున్నాయయి. టీడీపీ ప్రభుత్వం వంద రోజుల్లో గ్రామ పంచాయతీలకు రూ.1452 కోట్లు విడుదల చేసింది. - గౌరు చరిత, పాణ్యం ఎమ్మెల్యే

తాగునీటిని నిధులు ఇవ్వండి

నందికొట్కూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి నిధులు ఇవ్వాలి. 2019లో తన స్వగ్రామం కొణిదెలకు వచ్చినప్పుడు గ్రామా న్ని దత్తత తీసుకుంటానని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాల ద్వారా గ్రామాభివృద్ధికి కృషి చేయాలి. - గిత్తా జయసూర్య, నందికొట్కూరు ఎమ్మెల్యే

ఉపాధి పనుల వల్ల రైతులకు కూలీలు కరువయ్యారు

ఉపాధి హామీ పథకం వల్ల రైతులకు కూలీలు కరువయ్యారు. రైతుల పొలంలో పనులు చేసేం దుకు ఉపాధి హామీ కూలీలను కేటాయించాలి. సగం కూలీ రైతులు, మరో సగం కూలీ డబ్బులు ఉపాధి హామీ పథకం ద్వారా చెల్లించేలా చూడాలి. - బైరెడ్డి శబరి, నంద్యాల ఎంపీ

వెల్లువెత్తిన వినతులు:

డిప్యూటీ సీఎం పవన్‌కు పలువురు వినతులు ఇచ్చారు. ఎంపీడీవో అసోసియేషన్‌, పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్‌, గ్రామ సచివాలయాల అసోసియేషన్‌ నాయకులు వినతి పత్రాలు ఇచ్చారు. వాల్మీకి/బోయను ఎస్టీలు చేర్చాలని ఆ సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు.

Updated Date - Mar 23 , 2025 | 12:18 AM