Share News

ఉద్యాన పంటలను ప్రోత్సహించాలి: కలెక్టర్‌

ABN , Publish Date - Mar 29 , 2025 | 12:28 AM

జిల్లాలోని బీడుభూముల్లో ఉద్యానపంటలు వేసుకునేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు.

ఉద్యాన పంటలను ప్రోత్సహించాలి: కలెక్టర్‌
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లె, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని బీడుభూముల్లో ఉద్యానపంటలు వేసుకునేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సెంటినరీ హాల్‌లో నాణ్యమైన ఉల్లి, మిర్చి, పసుపు పెంపకం కోసం హార్టికల్చర్‌ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి వర్క్‌షాప్‌ కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని దొర్నిపాడు, ఉయ్యాలవాడ, కొలిమిగుండ్ల, కోవెలకుంట్ల మండలాల్లో ఖరీఫ్‌ చివరిలో మూడు నెలలు మాత్రమే 2లక్షల ఎకరాల్లో శనగ పంటవేసి తర్వాత 9నెలల సమయమంతా బీడు భూములుగా వదిలేస్తున్నారని, ఆ భూముల్లో ఉద్యానపంటలు వేసుకునేలా రైతులను ప్రోత్సహించాలని అన్నారు. రైతుల పెట్టుబడి తగ్గించి తలసరి ఆదాయం పెరిగేందుకు ఉద్యాన పంటలు ఉపయోగపడతాని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అనుబంధ రంగాల జిల్లా అధికారులు, యూనివర్శిటీ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2025 | 12:28 AM